ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆమె ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ చిన్నారి ఎవరు? ఎవరి కూతురు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ?;
సోషల్ మీడియా వాడకం పెరిగిపోయిన తర్వాత సెలబ్రిటీలు అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు. అందులో భాగంగానే తమ వ్యక్తిగత విషయాలను, చిన్ననాటి విషయాలను అభిమానులతో పంచుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా తమ చిన్నప్పటి ఫోటోలను ఇలా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అలరిస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు తమ చిన్ననాటి ఫోటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపరచగా.. ఇప్పుడు మరొక సెలబ్రిటీ డాటర్ కూడా తన చిన్ననాటి ఫోటోని అభిమానులతో పంచుకుంది.
ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన ఆమె ఫోటోలు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఈ ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ చిన్నారి ఎవరు? ఎవరి కూతురు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి ? ఇలా పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు ప్రముఖ సీనియర్ స్టార్ హీరో కమలహాసన్ చిన్న కూతురు అక్షర హాసన్. తన తల్లి సారిక పుట్టినరోజు కావడంతో తన చిన్ననాటి ఫోటోలతో పాటు తన తల్లితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఒక క్యాప్షన్ కూడా జోడించింది.
"మా అమ్మకు పుట్టినరోజు శుభాకాంక్షలు. తన బిడ్డను తనతో సమానమైన రాణిలా భావించే మహారాణి. ఆమె నిజమైన దయ , ధైర్యం, నిజాయితీ, విశాల హృదయం ఆమెను మరింత ఉన్నతంగా మార్చేశాయి. ఆమె మా అమ్మ మాత్రమే కాదు.. ప్రాణ స్నేహితురాలు కూడా.. మీ కుమార్తె అయినందుకు ధన్యవాదాలు. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు" అంటూ తన తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. ప్రస్తుతం అక్షర హాసన్ కి సంబంధించిన చిన్ననాటి ఫోటోలు వైరల్ అవ్వడంతో అభిమానులు ఎంత క్యూట్ గా ఉందో అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అక్షర హాసన్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ సినీ నటిగా, సహాయ దర్శకురాలిగా పేరు సొంతం చేసుకుంది. 2015లో వచ్చిన షమితాబ్ అనే చిత్రం ద్వారా అరంగేట్రం చేసిన ఈమె.. అంతకుముందు 2010లో రాహుల్ డోలకియా దర్శకత్వంలో వచ్చిన సొసైటీ సినిమాకి సహాయ దర్శకురాలిగా పనిచేసింది. ముంబైలో నిర్మించిన ఎన్నో యాడ్ ఫిలిమ్ లకు రామ్మూర్తి, రుచి నరైన్ వంటి దర్శకుల వద్ద సహాయ దర్శకురాలిగా పనిచేసింది.
ఇకపోతే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న సమయంలోనే ఎన్నో సినిమాలలో హీరోయిన్గా అవకాశం వచ్చినా.. వాటన్నింటినీ నిరాకరించింది. అలా ఆమె నిరాకరించిన చిత్రాలలో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమా కూడా ఒకటి.. ఇక ధనుష్ హీరోగా వచ్చిన షమితాబ్ అనే సినిమాతోనే హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. ఈమె సోదరి శృతిహాసన్ గురించి అందరికీ తెలిసిందే.. ఇక ఈమె శభాష్ నాయుడు అనే చిత్రానికి సహాయ దర్శకురాలిగా పనిచేసింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషలలో చిత్రీకరించారు.