అక్కినేని యంగ్ హీరోలంతా ఒకే ఫ్రేమ్‌లో?

తాజాగా అక్కినేని హీరోల స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ లో సుశాంత్ ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు.. అలాగే సుమంత సోద‌రి ప్ర‌ముఖ నిర్మాత సుప్రియ కూడా ఉన్నారు. వారితో పాటు క‌జిన్స్ కూడా ఉన్నారు.

Update: 2024-05-12 08:30 GMT

అక్కినేని వంశ వృక్షంలో లెజెండ్ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ద‌శాబ్ధాల పాటు టాలీవుడ్ ని ఏలారు. ఎన్టీఆర్ స‌మ‌కాలికుడిగా అగ్ర క‌థానాయ‌కుడిగా ఏఎన్నార్ ప్ర‌యాణం అన‌న్య సామాన్య‌మైన‌ది. స్వ‌యంకృషితో గొప్ప విలువ‌ల‌తో ఎదిగిన స్టార్ గా ఆయ‌న‌కు గుర్తింపు ఉంది. అక్కినేని అంద‌గాడిగా, సామ్రాట్ గా ఆయనకు ప్ర‌త్యేకించి మ‌హిళా ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న న‌ట‌వార‌సుడిగా అక్కినేని నాగార్జున సినీప‌రిశ్ర‌మ‌లో అగ్ర హీరో హోదాను అందుకున్నారు. అక్కినేని లెగ‌సీని విజ‌య‌వంతంగా ముందుకు న‌డిపించిన కింగ్ అత‌డు.

ఆ త‌ర్వాతి త‌రంలో.. అంటే అక్కినేని కుటుంబంలో మూడో జ‌న‌రేష‌న్ స్టార్లుగా న‌లుగురు పరిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం అయ్యారు. అక్కినేని యువ‌హీరోల్లో లీడ్ లో ఉన్న హీరోల్లో నాగ‌చైత‌న్య‌, అఖిల్ ..వీళ్ల‌తో పాటు సుమంత్ , సుశాంత్ కూడా ఉన్నారు. సుమంత్, సుశాంత్ ఇద్ద‌రూ అక్కినేని నాగేశ్వ‌ర‌రావు కుమార్తెల వార‌సులు.

ఏఎన్నార్ పెద్ద కుమార్తె సత్యవతి అక్కినేని- సురేంద్ర యార్లగడ్డ దంపతుల ఏకైక కుమారుడు హీరో సుమంత్. అతను పుట్టిన కొన్ని నెలల తర్వాత, సుమంత్ తల్లిదండ్రులు అమెరికా(నివాసం)కు తిరిగి వెళ్లగా, సుమంత్ త‌న తాత గారి చెంతే ఉండి ప‌రిశ్ర‌మ‌లో న‌టుడిగా కొన‌సాగారు. అలాగే అక్కినేని నాగేశ్వ‌ర‌రావు మ‌రో కుమార్తె నాగ సుశీల కుమారుడు సుశాంత్. సుమంత్, సుశాంత్ ఇద్ద‌రూ హీరోలుగా కొన‌సాగుతున్నారు. కెరీర్ ప‌రంగా కొన్ని ఒడిదుడుకుల‌ను ఎదుర్కొని ముందుకు సాగుతున్నారు.

Read more!

తాజాగా అక్కినేని హీరోల స్పెష‌ల్ ఫోటోగ్రాఫ్ లో సుశాంత్ ఇద్ద‌రు సోద‌రీమ‌ణులు.. అలాగే సుమంత సోద‌రి ప్ర‌ముఖ నిర్మాత సుప్రియ కూడా ఉన్నారు. వారితో పాటు క‌జిన్స్ కూడా ఉన్నారు. అక్కినేని యువ‌హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ్వ‌డం రేర్ అనే చెప్పాలి. ఇది హ్యాపీ మూవ్ మెంట్. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.

నాగ‌చైత‌న్య ప్ర‌స్తుతం చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో `తండేల్` అనే చిత్రంలో న‌టిస్తున్నారు. అఖిల్ తదుప‌రి న‌వ‌త‌రం ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేస్తున్నారు. తాత ఏఎన్నార్, తండ్రి నాగార్జున‌ల లెగ‌సీని ముందుకు తీసుకెళుతున్న వార‌సులుగా ఈ ఇద్ద‌రికీ గుర్తింపు ఉంది.

Tags:    

Similar News