• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అఖిల్ కొత్త లుక్ వెనుక...

అఖిల్ కొత్త లుక్ వెనుక సీక్రెట్ ఇదే..!

| ఇటీవల బెంగళూరులో జరిగిన సలార్ బ్లాక్ బస్టర్ వేడుకలో అఖిల్ అక్కినేని కనిపించడంతో చాలా మంది సర్ప్రైజ్‌ అయ్యారు.

By - Tupaki Desk
Update: 2024-01-22 10:30 GMT

ఇటీవల బెంగళూరులో జరిగిన సలార్ బ్లాక్ బస్టర్ వేడుకలో అఖిల్ అక్కినేని కనిపించడంతో చాలా మంది సర్ప్రైజ్‌ అయ్యారు. ఆ సమయంలో సోషల్‌ మీడియాలో అఖిల్ గురించిన చర్చ ప్రధానంగా జరిగింది. సలార్ 2 లో అఖిల్ కూడా ఉంటాడేమో అని, అందుకే సలార్ 1 బ్లాక్ బస్టర్‌ వేడుకలో పాల్గొన్నాడు అనే ప్రచారం కూడా జోరుగా సాగింది.

హొంబలే బ్యానర్‌ లో అఖిల్ ఒక సినిమా చేయబోతున్నాడని, అందుకే ఆ బ్యానర్‌ వారి ఆహ్వానం మేరకు అఖిల్ వచ్చి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. ఆ విషయాన్ని పక్కన పెడితే చాలా రోజుల నుంచి బయట కనిపించని అఖిల్‌ ఈ వేడుకలో కొత్త లుక్ లో కనిపించడంతో అంతా కూడా మరింత సర్‌ప్రైజింగ్ గా ఫీల్ అవుతున్నారు.

అఖిల్ గత చిత్రం ఏజెంట్‌ లో లుక్ కి తాజా లుక్ కి చాలా తేడా ఉంది. ఇంత మార్పుకు కారణం ఏమై ఉంటుంది అనే చర్చ కూడా ప్రధానంగా జరుగుతోంది. అఖిల్ న్యూ లుక్ కి కారణం ఏంటంటే.. త్వరలో అఖిల్ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ లో అనిల్‌ అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో 'ధీర' సినిమాను చేసేందుకు రెడీ అవుతున్నాడు.

ధీర సినిమా కోసం అఖిల్ తన లుక్ ను మార్చుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇంకా కూడా తన ఫిజిక్ విషయంలో అఖిల్ మరింత శ్రద్ధ కనబర్చుతున్నట్లు కూడా తెలుస్తోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ కథాంశంతో రూపొందబోతున్న సినిమాలో అఖిల్ లుక్‌ చాలా విభిన్నంగా ఉండబోతుందని యూవీ క్రియేషన్స్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

కెరీర్‌ ఆరంభం నుంచి భారీ కమర్షియల్‌ సక్సెస్ కోసం వెయిట్‌ చేస్తున్న అఖిల్‌ కి ధీర సినిమా తో ఆ విజయం దక్కే అవకాశాలు ఉన్నాయని అక్కినేని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. అందుకోసం చాలా ఎక్కువగా అఖిల్‌ కష్టపడుతున్నాడు. జిమ్‌ లో వర్కౌట్స్ చేస్తున్న సమయంలో అఖిల్ చేతికి గాయం అయ్యిందనే వార్తలు కూడా వస్తున్నాయి. ధీర సినిమా సమ్మర్ లో సెట్స్‌ పైకి వెళ్తుందని సమాచారం అందుతోంది.

Tags:    
  • Akhil 
  • Newlook 
  • Salaar 
  • Uvcreations 
  • Anil 
  • Dhira 
  • Movie 

Similar News

దర్శకుడిగా రాపిడో డ్రైవర్.. అసలు విషయం చెప్పిన వెంకీ కుడుముల

2026-11-08 05:48 GMT

శ్రీలీల కీలక నిర్ణయం.. ఇక ఈ హీరోయిన్ జోరు ఆపేవాళ్ళు ఎవరు గురు..!

2026-11-08 05:46 GMT

రావణుడిగా ప్రభాస్…అంత ఘోర అవమానం తరువాత ఇది అవసరమా..!

2026-11-08 04:55 GMT

మణిరత్నం.. చిరంజీవి..ఓ తమిళ దళపతి..!

2026-11-08 04:54 GMT

రామాయణం తీస్తూ రాముడినే మర్చిపోయారా?

2026-11-08 04:54 GMT

9వ వారం ఎలిమినేషన్ క్యాన్సిల్!

2026-11-08 04:43 GMT

యంగ్ హీరోల పాన్ ఇండియా 2027 టార్గెట్ ప్లాన్స్!

2026-11-07 17:30 GMT

ముంబైలో షూటింగ్‌లు చేయడం నరకమే!

2026-11-07 14:30 GMT

నాగచైతన్య 'వృషకర్మ' ఫస్ట్ సింగిల్.. అర్జున్ హై వోల్టేజ్ వైబ్

2026-11-07 14:04 GMT

టైమ్ మెషీన్ లోకి వెళ్లొచ్చాడా.. 'రుక్మిణి' కోసం నితిన్ స్టన్నింగ్ లుక్!

2026-11-07 13:52 GMT

2007 సైకలాజికల్ హారర్ క్లాసిక్ '1408'కి సీక్వెల్!

2026-11-07 13:49 GMT

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS