అఖిల్ ‘లెనిన్’లో క్లైమాక్స్ కీ రోల్.. హిట్ నిర్ణయించేది ఇదేనా?

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘లెనిన్’ జూలై 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్ చేస్తున్న ప్రమోషన్లలో ఒక విషయం మాత్రం బాగా హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2026-07-08 14:30 GMT

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘లెనిన్’ జూలై 10న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా అఖిల్ చేస్తున్న ప్రమోషన్లలో ఒక విషయం మాత్రం బాగా హాట్ టాపిక్‌గా మారింది. ప్రతి ఇంటర్వ్యూలోనూ అఖిల్ సినిమా లాస్ట్ క్లైమాక్స్ గురించి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తున్నాడు. క్లైమాక్స్ ట్విస్ట్ చూసి ఆడియన్స్ షాక్ అవుతారని చెప్తున్నాడు. అయితే ఈ ఓవర్ ప్రమోషన్ సినిమాకు హెల్ప్ అవుతుందా, లేక రివర్స్ అవుతుందా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం..

ఆ 20 నిమిషాలే సినిమాకు ప్రాణం:

సినిమా ప్రమోషన్లలో అఖిల్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. ‘లెనిన్’ సినిమా ముగింపు ఎవరూ ఊహించని రేంజ్‌లో ఉంటుందని, అదే ఈ సినిమాకు అసలైన ఆత్మ అని అఖిల్ పదే పదే చెప్తున్నాడు. ఎమోషనల్ నోట్‌తో ఎండ్ అయ్యే ఈ లాస్ట్ 20 మినిట్స్ ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ ఫీలింగ్‌ను ఇస్తుందని నమ్ముతున్నాడు. ఇక అఖిల్ ఇస్తున్న ఈ బిల్డప్‌తో జనాల్లో సినిమా క్లైమాక్స్ మీద క్యూరియాసిటీ విపరీతంగా పెరిగిపోయింది.

టాలీవుడ్‌లో 'ఓవర్-సెల్లింగ్' భయం:

అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇటీవలి కాలంలో తెలుగు సినిమాలో క్లైమాక్స్‌ను ఓవర్‌గా ప్రమోట్ చేసి థియేటర్లలో తుస్ మనిపించడం చూసాం. ఇక మొన్న వచ్చిన 'పెద్ది', అలాగే రాజా సాబ్, దేవర వంటి భారీ చిత్రాలకు కూడా మేకర్స్ ఇలాగే చివరి అరగంట ఊహించని రేంజ్‌లో ఉంటుందని ఇంటర్వ్యూలలో ఊదరగొట్టారు. కానీ థియేటర్లలోకి వెళ్లాక ఆ హైప్‌కు తగ్గ ఇంపాక్ట్ కనిపించక ఆడియన్స్ డిజప్పాయింట్ అయ్యారు. ఇక ఇప్పుడు 'లెనిన్' విషయంలోనూ అదే జరుగుతుందేమోనని ట్రేడ్ వర్గాలు భయపడుతున్నాయి.

అఖిల్ కెరీర్‌కు ఇదొక పెద్ద రిస్క్ ఫ్యాక్టర్:

అఖిల్ చేస్తున్న ఈ క్లైమాక్స్ ప్రమోషన్ ఒకవేళ నిజమైతే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది.అయితే ఆ ట్విస్ట్ పనిచేయకపోతే, ఆడియన్స్ మామూలుగా కాకుండా నిరుత్సాహంగా బయటికి వెళ్లే అవకాశం ఉంది. ఇక దీనివల్ల నెగటివ్ టాక్ చాలా స్పీడ్‌గా స్ప్రెడ్ అయ్యే ప్రమాదం ఉంది. అఖిల్‌కు ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ చాలా అవసరం. థియేటర్లలో కేవలం ఓపెనింగ్స్ వస్తే సరిపోదు, ఖచ్చితంగా మౌత్ టాక్ బాగుంటేనే సినిమా నిలబడుతుంది. అందుకే ఈ క్లైమాక్స్ టాక్ అనేది అఖిల్ పాలిట రెండు అంచుల కత్తిలా మారింది.

సెన్సార్ రచ్చ.. 'A' నా? 'U/A' నా?:

ఇదిలా ఉంటే, ఈ సినిమా సెన్సార్ విషయమై ఇండస్ట్రీలో ఒక ఇంట్రెస్టింగ్ గాసిప్ నడుస్తోంది. సినిమాలో ఉన్న కొన్ని వైలెంట్ లేదా ఇంటెన్స్ సీన్స్ కారణంగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'A' (అడల్ట్) సర్టిఫికేట్ ఇవ్వడానికి రెడీగా ఉందట. అయితే, ఫ్యామిలీ ఆడియన్స్ దూరం కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ మాత్రం 'U/A' సర్టిఫికేట్ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నట్లు సమాచారం.

ఇంటర్నల్ స్క్రీనింగ్స్ నుంచి వస్తున్న రిపోర్ట్స్ అయితే పాజిటివ్‌గానే ఉన్నాయని టాక్ వినిపిస్తోంది. కానీ అసలైన పరీక్ష యూఎస్ ప్రీమియర్లతోనే మొదలవుతుంది. మరి అఖిల్ అంతలా నమ్ముతున్న ఆ లాస్ట్ 20 మినిట్స్ మ్యాజిక్ థియేటర్లలో పేలుతుందా? అఖిల్ వెయిట్ చేస్తున్న ఆ బిగ్గెస్ట్ బ్రేక్ థ్రూ ఈ సినిమాతో వస్తుందో లేదో తెలియడానికి మరికొద్ది గంటలు ఆగితే సరిపోతుంది..

Tags:    

Similar News