అక్కినేని ఫ్యాన్స్ కు స‌ర్‌ప్రైజ్ ఇచ్చిన లెనిన్

హే ఇన్న‌వా.. అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్ రాగా ఈ సాంగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. త‌మ‌న్ సంగీతంలో వ‌చ్చిన ఈ సాంగ్ వినగానే న‌చ్చేలా మంచి ట్యూన్ తో వ‌చ్చింది.;

Update: 2026-01-05 17:17 GMT

అక్కినేని నాగార్జున కొడుకుగా సినీ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ కు ఇప్ప‌టివ‌ర‌కు ఒక్క‌టి కూడా చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ లేదు. క‌ష్ట‌మైతే ప‌డుతున్నాడు త‌ప్పించి అఖిల్ కు స‌క్సెస్ మాత్రం అంద‌నంత దూరంలోనే ఆగిపోతుంది. ఏజెంట్ సినిమా అయినా త‌న‌కు మంచి స‌క్సెస్ ను ఇచ్చి, త‌న మార్కెట్ ను పెంచుతుంద‌నుకుంటే ఆ సినిమా టాలీవుడ్లోని అతి పెద్ద డిజాస్ట‌ర్ల లిస్ట్ లోకి చేరింది.

 

ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో లెనిన్

దీంతో అఖిల్ త‌ర్వాతి సినిమా విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాడు. ఎంతో మంది డైరెక్ట‌ర్లను క‌లిసి, ఎన్నో క‌థ‌ల‌ను విని ఆఖ‌రికి ఒక క‌థ‌కు ఓకే చెప్పాడు. అలా చెప్పిన సినిమానే లెనిన్. ముర‌ళీ కిషోర్ అబ్బూరి ద‌ర్శ‌క‌త్వంలో అఖిల్ హీరోగా వ‌స్తున్న లెనిన్ మూవీని అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార ఎంట‌ర్టైన్మెంట్స్ బ్యాన‌ర్ల‌లో నాగార్జున‌, నాగ‌వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

శ్రీలీల ప్లేస్ లో భాగ్య‌శ్రీ

రాయ‌లసీమ బ్యాక్ డ్రాప్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా వాస్త‌వానికి ఎప్పుడో రిలీజ‌వాల్సింది కానీ కొంత‌భాగం షూటింగ్ పూర్త‌య్యాక శ్రీలీల లెనిన్ నుంచి త‌ప్పుకోవ‌డంతో భాగ్య శ్రీ బోర్సేతో మ‌ళ్లీ ఆ షూటింగ్ అంతా పూర్త‌య్యేస‌రికి టైమ్ ప‌ట్టింది. అయితే ఇప్పుడీ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ పూర్త‌వ‌డానికి వ‌చ్చిన‌ట్టు రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో నిర్మాత నాగ వంశీ కూడా చెప్ప‌గా, తాజాగా లెనిన్ నుంచి ఫ‌స్ట్ సింగిల్ ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు.

ఆక‌ట్టుకుంటున్న లెనిన్ ఫ‌స్ట్ సింగిల్

హే ఇన్న‌వా.. అంటూ సాగే ఫ‌స్ట్ సింగిల్ రాగా ఈ సాంగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. త‌మ‌న్ సంగీతంలో వ‌చ్చిన ఈ సాంగ్ వినగానే న‌చ్చేలా మంచి ట్యూన్ తో వ‌చ్చింది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాట‌ను శ్వేతా మోహ‌న్, జుబిన్ ఆల‌పించగా, ఈ సాంగ్ తో పాటూ మేక‌ర్స్ లెనిన్ మూవీ రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. సాంగ్ చూస్తుంటే ప‌ల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో జాత‌ర‌ను త‌ల‌పిస్తూ ఈ సాంగ్ కొన‌సాగుతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఇక సినిమా విష‌యానికొస్తే ఈ మూవీలో అఖిల్ మాస్ లుక్ లో క‌నిపించ‌నుండ‌గా, లెనిన్ సినిమాను మే 1వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్న‌ట్టు మేక‌ర్స్ ఫ‌స్ట్ సింగిల్ తో పాటూ అనౌన్స్ చేశారు. ఫ‌స్ట్ సింగిల్ తో పాటూ మేక‌ర్స్ రిలీజ్ డేట్ అప్డేట్ ను కూడా ఇవ్వ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. మ‌రి ఈసారైనా అఖిల్ హిట్ అందుకుంటారేమో చూడాలి.


Full View
Tags:    

Similar News