అఖిల్ తదుప‌రి చిత్రంపై ఆస‌క్తి?

అక్కినేని వార‌సుడు అఖిల్ ఇటీవ‌లే `లెనిన్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే.

Update: 2026-07-11 15:21 GMT

అక్కినేని వార‌సుడు అఖిల్ ఇటీవ‌లే `లెనిన్` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. సినిమాకు మంచి టాక్ వ‌స్తోంది. దీంతో అక్కినేని ఫ్యామిలీ స‌హా అభిమానులంతా ఎంతో సంతోషంగా ఉన్నారు. చాలా కాలం త‌ర్వాత స‌రైన హిట్ ప‌డ‌టంతో రెట్టించిన ఉత్సాహం క‌నిపిస్తోంది. అయితే ఒక సక్సెస్ వచ్చిన తర్వాత సహజంగానే తదుపరి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఉంటాయి. సాధారణంగా అఖిల్ తన సినిమాలు సెట్స్‌లో ఉన్నప్పుడే తర్వాతి కథలను ఖరారు చేసుకుంటాడు. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. అఖిల్ తదుపరి చిత్రం కోసం దర్శకుడిని గానీ, కథను గానీ లాక్ చేయ‌క‌పోవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

దీంతో ఆల‌స్యానికి కార‌ణాలు ఏంట‌నే చ‌ర్చ నెట్టింట మొద‌లైంది. ఈ నేప‌థ్యంలో ప్రధాన కారణం అఖిల్ తీసుకుంటున్న జాగ్రత్తలేన‌ని తెలుస్తోంది. `లెనిన్` పై రిలీజ్ కు ముందు నుంచే మంచి న‌మ్మ‌కంతో ఉన్నాడు. వ‌చ్చిన‌ సక్సెస్‌ను నిలబెట్టుకోవాలని తదుపరి ఎంపికలో ఏమాత్రం పొరపాట్లు జరగకూడదని భావిస్తున్నట్లు క‌నిపిస్తుంది. తొందరపడి ఏదో ఒక కథను ఎంచు కోవడం కంటే ఇమేజ్‌కి సరిపోయే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కోసం వేచి చూస్తున్న‌ట్లు తెలుస్తోంది. అయితే అఖిల్ కోసం చాలా మంది ద‌ర్శకులు కథలు సిద్ధం చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

స్టోరీల విష‌యంలో అఖిల్ కూడా మునుప‌టిలా కాకుండా చాలా పాజిటివ్ గా ఉన్న‌ట్లు తెలుస్తోంది. పేరున్న దర్శకులకే ప్రాధాన్యత ఇవ్వకుండా తన నటనకు కొత్త కోణాన్ని ఇచ్చే స్క్రిప్ట్‌ల వైపు మొగ్గు చూపుతున్నాడు. ఈ క్రమంలోనే పలువురు యువ దర్శకులతో కూడా ఆయన చర్చలు జ‌ర‌ప‌డానికి సిద్దంగా ఉన్న‌ట్లు తెలిసింది. ఈ స్లో ప్రాసెస్ వెనుక అఖిల్ పరిణితి చెందిన నిర్ణయాలు కనిపిస్తున్నాయి. కెరీర్ ఆరంభంలో చేసిన తప్పులను మరోసారి పునరావృతం చేయకూడదనే ఉద్దేశంతోనే సమయం తీసుకుంటున్నాడు. అభిమానుల ఆశలకు అనుగుణంగా సక్సెస్ గ్రాఫ్‌ను కాపాడుకోవడానికి నిరీక్షణ అవసరమని అఖిల్ బలంగా నమ్ముతున్నాడు.

మ‌రి అఖిల్ తదుపరి చిత్రం ఏ తరహాలో ఉంటుంది? మళ్ళీ మాస్ యాక్షన్ వైపు వెళ్తాడా? లేక క్లాస్ ఎంటర్టైనర్‌తో సర్ప్రైజ్ చేస్తాడా? అనేది వేచి చూడాలి. ఏదేమైనా? అఖిల్ ఎంచుకునే కథే భవిష్యత్తులో అఖిల్ స్థాయిని మరింత పెంచే విధంగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు. ఈ గ్యాప్ కేవలం స్క్రిప్ట్ ఎంపికకే పరిమితం కాకుండా బాడీ లాంగ్వేజ్ .. మేకోవర్‌లో కూడా మార్పులు చేసుకునేందుకు అఖిల్ వినియోగించుకుంటాడు. `లెనిన్` లో కనిపించిన లుక్ కి పూర్తి భిన్నంగా మేకోవ‌ర్ కానున్నాడు.

Tags:    

Similar News