లెనిన్ నుంచే అఖిల్ కొత్త యుద్ధం.. అంతా కూల్ గానేనా?

కానీ అఖిల్ మాత్రం తన హ్యాపీ నెస్ కంట్రోల్ చేసుకుంటూ, ఇకపై తన జర్నీ కొత్తగా మొదలవుతుందని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.

Update: 2026-07-16 05:09 GMT

'కాలర్ ఎగరేయను.. గంతులు వేయను.. అరవను కూడా.. ప్రశాంతంగా నా యుద్ధం నేను చేస్తా'.. గుంటూరులో జరిగిన లెనిన్ సక్సెస్ మీట్‌ లో అక్కినేని అఖిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగా భారీ విజయం వచ్చిన తర్వాత హీరోలు పుల్ జోష్ లో మాట్లాడటం చూస్తుంటాం. కానీ అఖిల్ మాత్రం తన హ్యాపీ నెస్ కంట్రోల్ చేసుకుంటూ, ఇకపై తన జర్నీ కొత్తగా మొదలవుతుందని చెప్పడం ఆసక్తి కలిగిస్తోంది.

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్‌ కు కెరీర్ స్టార్టింగ్ నుంచి సవాళ్లే ఎక్కువగా ఎదురయ్యాయి. భారీ అంచనాలతో వచ్చిన తొలి సినిమా ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాత చేసిన సినిమాల్లో నటుడిగా ప్రశంసలు దక్కినా, బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయాలు మాత్రం అందలేదు. కొంతకాలం పాటు అఖిల్ కెరీర్‌ లో సరైన బ్రేక్ కోసం ఎదురు చూడాల్సి వచ్చింది.

ఆ వెయిటింగ్ కు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కొంత ఊరటనిచ్చినా, ఏజెంట్ సినిమా మరోసారి నిరాశ పరిచింది. ఆ సినిమా కోసం అఖిల్ చేసిన కష్టంపై ప్రశంసలు వచ్చినా, రిజల్ట్ మాత్రం అనుకూలంగా రాలేదు. దీంతో అఖిల్ నెక్స్ట్ మూవీపై అంతా ఆసక్తి నెలకొంది. అలాంటి సమయంలో ఆయన కొంత గ్యాప్ తీసుకుని, కొత్త కథ కోసం వెయిట్ చేశారు. ఆ ఎదురుచూపులకు సరైన ఆన్సర్ రూపంలో వచ్చింది లెనిన్.

రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఆ యాక్షన్ డ్రామాలో అఖిల్ పూర్తిగా కొత్త లుక్‌ లో కనిపించారు. మాస్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఆ సినిమా విడుదలైన తర్వాత మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా అఖిల్ నటన, స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రలో కనిపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. అయితే లెనిన్ విజయం కంటే ఎక్కువగా ఇప్పుడు చర్చకు వస్తున్నది అఖిల్ కామెంట్స్.

"ఇక్కడి నుంచే నా జర్నీ మొదలవుతుంది" అని ఆయన చెప్పడం వెనుక పెద్ద అర్థమే కనిపిస్తోంది. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ ను పక్కన పెట్టి కొత్త ఛాప్టర్ స్టార్ట్ చేస్తున్నానని అఖిల్ క్లియర్ గా చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు, గతంలో అక్కినేని కుటుంబ హీరోలపై వచ్చిన విమర్శలు, అఖిల్ వరుస పరాజయాల తర్వాత సోషల్ మీడియాలో జరిగిన చర్చలు కూడా తెలిసిందే. అలాంటి పరిస్థితుల్లో లెనిన్ విజయం ఆయనకు కేవలం హిట్ మాత్రమే కాదు.. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తిరిగి ఇచ్చిన సినిమా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే అసలు పరీక్ష ఇప్పుడే మొదలవుతుంది. ఒక హిట్‌ తో జర్నీ మారొచ్చు కానీ ఎదగాలంటే వరుస విజయాలు అవసరం. అందుకే అఖిల్ ప్రశాంతంగా యుద్ధం చేస్తానంటూ చేసిన కామెంట్స్ లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పాటు బాధ్యత కనిపిస్తోంది. అందుకే లెనిన్ అఖిల్‌ కు విజయాన్ని ఇచ్చింది. కానీ గట్టిగా సంబరాలు చేసుకోవడం కంటే, సైలెంట్ గా ముందుకు సాగాలని అఖిల్ నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. ఇక కూల్ వార్ ఆయనను టాలీవుడ్‌ లో ఎంతటి రేంజ్ కు తీసుకెళ్తుందో చూడాలి.

Tags:    

Similar News