ఈ సినిమా తప్పు చేసే ఛాన్సే లేదు.. లెనిన్ పై నాగవంశీ కాన్ఫిడెన్స్!
రిలీజ్ కు ముందు మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
అఖిల్ అక్కినేని హీరోగా మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన లెనిన్ జులై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ కు ముందు మేకర్స్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్‌లో నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా అఖిల్ లుక్, మాస్ ఇమేజ్, సినిమాపై తమ నమ్మకం గురించి ఆయన చెప్పిన మాటలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.
అఖిల్‌ను ఈ సినిమాలో పూర్తిగా కొత్తగా చూపించాలన్నదే తమ మెయిన్ టార్గెట్ అని నాగవంశీ వెల్లడించారు. ఇప్పటివరకు అఖిల్ స్క్రీన్‌పై చాలా క్లాస్‌గా, తెల్లగా కనిపించడంతో ఆడియన్స్ అతడిని పూర్తిస్థాయి మాస్ హీరోగా స్వీకరించలేదనే అభిప్రాయాలు వినిపించాయని పేర్కొన్నారు. అందుకే లెనిన్ కోసం అఖిల్ లుక్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నామని, రోజూ గంటల తరబడి మేకప్ వేసి మరీ అతడిని సహజమైన పల్లెటూరి అబ్బాయిగా కనిపించేలా తీర్చిదిద్ది, ఆఖరికి నల్లగా చేశామని తెలిపారు. ఈ సినిమాలో అఖిల్‌ను చూస్తే కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తిలా కాకుండా, పక్కింటి కుర్రాడిలా కనిపిస్తాడని, సినిమాలో అఖిల్ ను చూస్తున్నంత సేపు నాగేశ్వరరావు గారి మనవడు, నాగార్జున గారి కొడుకు అనే దాని కంటే పక్కంటి అబ్బాయిలా ఫీల్ అవుతారని, అదే లెనిన్ కు మాస్ కనెక్ట్‌ను తీసుకొస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అఖిల్ ఫ్యాన్స్ కు లెనిన్ కాలర్ ఎత్తుకునే సినిమా అవుతుందా? అనే ప్రశ్నకు కూడా నాగవంశీ ఆసక్తికర సమాధానమిచ్చారు. కాలర్లు ఎత్తడం అవసరం లేదు. కానీ సినిమా చూసిన తర్వాత అభిమానులు గర్వంగా ఫీలవుతారని, కాలర్ మాటలు ఇప్పుడే చెప్పదలచుకోలేదంటూ నవ్వుతూ సమాధానమిచ్చారు. గతంలో తాను డిస్ట్రిబ్యూషన్ చేసిన ఒక సినిమా విషయంలో ఇలాంటి భారీ కామెంట్స్ చేసి ఇబ్బందులు ఎదుర్కొన్న అనుభవం ఉండటంతో, ఈసారి అంచనాల విషయంలో జాగ్రత్తగా మాట్లాడుతున్నానని వంశీ తెలిపారు.
లెనిన్ మూవీ అఖిల్ కెరీర్‌కు ఎంత పెద్ద ప్లస్ అవుతుందనే ప్రశ్నకు కూడా నాగవంశీ ఆత్మవిశ్వాసంతో స్పందించారు. సినిమా ఇంత చేస్తుంది, అంత చేస్తుందని ముందుగానే గొప్పలు చెప్పే ఉద్దేశం తమకు లేదని, అలాగని ఈ సినిమా తప్పు చేసే పరిస్థితి లేదని, సినిమా రేంజ్ ఏంటనేది శుక్రవారం సాయంత్రం సినిమా రిలీజయ్యాక ఆడియన్సే చెప్తారని, నాగార్జున గారు చెప్పినట్టు ఈ సినిమాతో కొడుతున్నామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే టీజర్, ట్రైలర్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లెనిన్ సినిమాపై నాగవంశీ చేసిన కామెంట్స్ మరింత ఆసక్తిని పెంచుతున్నాయి. అఖిల్‌కు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కమర్షియల్ బ్రేక్ ఈ సినిమాతో దక్కుతుందా లేదా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. జులై 10న రిలీజయ్యే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.