అఖండ ప్రీమియర్ రేట్లు ఎలా ఉండబోతున్నాయి?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఇండస్ట్రీలో ఉత్కంఠ పెరుగుతోంది.;

Update: 2025-11-29 18:06 GMT

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న 'అఖండ 2: తాండవం' రిలీజ్ డేట్ దగ్గరపడుతున్న కొద్దీ ఇండస్ట్రీలో ఉత్కంఠ పెరుగుతోంది. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అయితే ఇప్పుడు సినిమా కంటెంట్ కంటే ఎక్కువగా.. టికెట్ రేట్ల విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అసలు ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వేయబోయే ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలకు మేకర్స్ ఒక భారీ రేటును ఫిక్స్ చేయాలని చూస్తున్నారట. ఒక్కో టికెట్ కు రూ. 600 ఉండేలా ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇంకా దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు కానీ, ఈ ప్రపోజల్ మాత్రం డిస్కషన్ లో ఉందని గట్టిగా వినిపిస్తోంది.

నిజానికి మొన్నటి వరకు నిర్మాతలు చాలా బ్యాలెన్స్డ్ గా మాట్లాడారు. "రేట్లు పెంచుతాం కానీ, జనాలు తిట్టుకునేలా ఉండవు. రీజనబుల్ గానే ఉంటాయి" అని క్లారిటీ ఇచ్చారు. గతంలో కొన్ని సినిమాలకు ప్రీమియర్స్ రేట్లు 1000, 1500లకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఫ్యాన్స్ షోలకు ఈ రేటు ఓకే అనుకున్నా, సామాన్య ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే సందేహం ఉంది. అయితే సినిమాకున్న క్రేజ్ దృష్ట్యా జనం ఎగబడతారని బయ్యర్లు నమ్ముతున్నారు.

రిలీజ్ కు ఒక్కరోజు ముందు నుంచే దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రీమియర్స్, ఫ్యాన్స్ షోలు ప్లాన్ చేస్తున్నారు. ఈ షోల ద్వారానే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టాలనేది మేకర్స్ ప్లాన్. 250 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది కాబట్టి, ఆ మొత్తం రికవరీ అవ్వాలంటే ఈ మాత్రం హైక్స్ తప్పవని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఇది కేవలం ప్రతిపాదన మాత్రమేనా, లేక ప్రభుత్వాలు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా అనేది తెలియాల్సి ఉంది.

త్వరలోనే దీనిపై పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రూ. 600 కన్ఫర్మ్ అయితే మాత్రం, ఓపెనింగ్ డే కలెక్షన్స్ లో బాలయ్య బాబు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించడం ఖాయం.

మొత్తానికి 'అఖండ 2' అన్ని రకాలుగానూ వార్తల్లో నిలుస్తోంది. అఘోరా గెటప్ లో బాలయ్య చేసే శివ తాండవం చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాబట్టి టిక్కెట్ రేట్లపై పెద్దగా అభ్యంతరాలు రాకపోవచ్చు. ఇక డిసెంబర్ 5న థియేటర్లలో ఈ సినిమా ఏ రేంజ్ విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి.

Tags:    

Similar News