చిరంజీవి, బాల కృష్ణ , పవన్ కళ్యాణ్ ఎవరు తగ్గుతారు?
సెప్టెంబర్ 25 న 'అఖండ-2', 'ఓజీ' రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. తొలిసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య-పవన్ తలపడుతున్నారు.;
సెప్టెంబర్ 25 న 'అఖండ-2', 'ఓజీ' రిలీజ్ కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. తొలిసారి బాక్సాఫీస్ వద్ద బాలయ్య-పవన్ తలపడుతున్నారు. గతంలో ఎప్పుడూ బాలయ్య-పవన్ ఇలా తలపడలేదు. తొలిసారి ఆ సన్నివేశం చోటు చేసుకోవడంతో? సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒకేసారి ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే నష్టపోయేది నిర్మాత కాబట్టి! ఈ రెండు చిత్రాల్లో ఏదో ఒకటి మాత్రమే రిలీజ్ అవుతుం దన్నది తాజా సమాచారం. ఆ సంగతి పక్కన బెడితే ఈ రెండు సినిమాలకంటే వారం ముందు అంటే సెప్టెంబర్ 18న చిరంజీవి నటిస్తోన్న `విశ్వంభర` రిలీజ్ తేదీగా ముహూర్తం పెట్టినట్లు వినిపిస్తోంది.
ఈ సినిమా ఇప్పటికే బాగా డిలే అయిన నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదీకి రిలీజ్ చేయాలని పట్టు మీద ఉన్నారుట. ఈ విషయంలో ఎంత మాత్రం రాజీ పడేది లేదని పోటీగా తమ్ముడు పవన్ కళ్యాణ్ ఉన్నా...సమాకాలీకుడు బాలయ్య ఉన్నా? అన్నయ్య మాత్రం వెనక్కి తగ్గేదేలేదు అన్న మాట గట్టిగా వినిపిస్తుంది. మరి ఒకేసారి మూడు సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు సర్దుబాటు కూడా కష్టమే. రిలీజ్ అయిన సినిమాలకు న్యాయం జరగదు. హిట్ టాక్ వచ్చినా? థియేటర్లు లేకపోతే నష్టాలే తప్ప రూపాయి లాభం ఉండదు.
ఈనేపథ్యంలో ఏదో ఒక సినిమా వెనక్కి తగ్గడం గ్యారెంటీ. కానీ ఆ సినిమా ఏది అవుతుందన్నదే ఆసక్తికరం. బాలయ్య మాత్రం వెనక్కి తగ్గే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే 'అఖండ 2'ని సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తామని ప్రారంభోత్సవం నాడే చెప్పారు. ఆ మాటకు కట్టుబడే సినిమాను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. బాలయ్యకు సినిమాలను వాయిదా వేసిన చరిత్ర కూడా పెద్దగా లేదు. ఇవన్నీ కూడా పరిగణలో ఉంటాయి. ఇక్కడ బాలయ్యకు పోటీగా మధ్యలో దూరింది ఎవరంటే ఓజీ మాత్రమే.
ఈ సినిమా అనివార్య కారణాలతో డిలే అయింది. చివరిగా బాలయ్య సినిమా రిలీజ్ రోజునే ఓజీ కూడా పెట్టుకోవడం అన్నది ఎంత మాత్రం భావ్యం కాదు. కాబట్టి 'ఓజీ' కే వెనక్కి తగ్గే అవకాశాలు కనిపి స్తున్నాయి. ఇక్కడ మరో ప్రధాన కారణం కూడా కనిపిస్తుంది. అన్నయ్య చిరంజీవికే తమ్ముడు పవన్ కళ్యాణ్ లైన్ క్లియర్ చేసే అవకాశం ఉంది. `భోళా శంకర్` ప్లాప్ తో ఉన్న చిరంజీవి కూడా బౌన్స్ బ్యాక్ కోసమైనా తమ్ముడు ఆలోచించాలి. మరేం జరుగుతుందన్నది చూడాలి.