బాలయ్య-పవన్ స్పీడ్ కి వాళ్లు బ్రేక్ వేస్తారా?
నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న 'అఖండ-2', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` చిత్రాలు ఒకే రోజు రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.;
నటసింహ బాలకృష్ణ నటిస్తోన్న 'అఖండ-2', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న `ఓజీ` చిత్రాలు ఒకే రోజు రిలీజ్ డేట్లు లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు చిత్రాలు సెప్టెంబర్ 25న రిలీజ్ అవుతున్నట్లు ప్రకటించారు. తొలుత ఈ డేట్ ని లాక్ చేసుకుంది బాలయ్య. ఆ తర్వాత 'ఓజీ' సీన్ లోకి వచ్చింది. షూటింగ్ డిలే కారణంగా వాయిదాల పడుతూ వచ్చిన చిత్రాన్ని సరిగ్గా బాలయ్య సినిమా రిలీజ్ రోజునే పెట్టారు. దీంతో బాలయ్య అభిమానుల్లో కాస్త అసంతృప్తి వ్యక్తమవుతుంది.
మా హీరో మీదకి పోటీగా వస్తున్నాడా? ఇది కావాలనే చేస్తున్నారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రిలీజ్ లు ఒకేసారి ఉంటే మాత్రం అభిమానుల మధ్య వైరం కూడా తప్పదు. ఇది ఒక కోణమైతే? ఈ రెండు రిలీజ్ లను డిసైడ్ చేయాల్సింది నిర్మాతలు కాదు. ఓటీటీలు అన్నది కూడా గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం సినిమా రిలీజ్ కి సంబంధించి ఓటీటీ స్లాట్ ఇస్తుంది. ఆప్రకారమే థియేట్రికల్ గా రిలీజ్ అవుతున్నాయి.
నిర్మాతలు కూడా వాళ్ల చేతుల్లో లాక్ అవ్వడంతో రిలీజ్ విషయంలో వాళ్లకు స్వేచ్చ లేదు. ఈ నేపథ్యంలో 'అఖండ'-'ఓజీ'లు ఒకేసారి రిలీజ్ అన్నది ఓటీటీలు ఆ ఛాన్స్ తీసుకునే అవకాశం ఉండదు. ఓటీటీ ఓ ఆర్డర్ ప్రకారం రిలీజ్ స్లాట్ లు ఇస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు..ఎలా పడితే అలా స్లాట్ లు ఇవ్వదు. ఆ లెక్కన చూస్తే 'అఖండ 2' ముందే రిలీజ్ వేసుకుంది. కాబట్టి ఓటీటీ కూడా సెప్టెంబర్ 25కి కట్టుబడి ఉండే అవకాశం ఉంది.
కానీ 'ఓజీ' రిలీజ్ అన్నది అనుహ్యంగా మధ్యలో వచ్చింది. ఇది నిర్మాతలు ఇచ్చిన డేట్ గా కనిపిస్తుంది. ఓటీటీ దగ్గరకు వెళ్తే ఆ డేట్ మారుతుందనే సంకేతాలు అందుతున్నాయి. ఇద్దరు అగ్ర హీరోల సినిమాలు ఒకే రోజు రిలీజ్ అంటే ఓటీటీ ఎంత మాత్రం అంగీకరించదు. అలాగని ఓటీటీని కాదని నిర్మాతలు రిలీజ్ చేయలేరు. చేస్తే ఓటీటీ బిజినెస్ పై వేటు పడుతుంది. ఈనేపథ్యంలో సెప్టంబర్ 25న ఒక సినిమా తప్ప మరో సినిమా రావడం కష్టమని తెలుస్తోంది.