'అఖండ 2' ఓపెనింగ్స్.. బాలయ్య కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ అలా..

తాజాగా అఖండ 2 తొలిరోజు వసూళ్ల వివరాలను మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు.;

Update: 2025-12-13 07:50 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో రూపొందిన అఖండ 2: తాండవం మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ మూవీ అఖండకు సీక్వెల్ గా తెరకెక్కిన ఆ సినిమా.. డిసెంబర్ 12వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైంది. డిసెంబర్ 11 నైట్ పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయి.




 


తాజాగా అఖండ 2 తొలిరోజు వసూళ్ల వివరాలను మేకర్స్ సోషల్ మీడియాలో ప్రకటించారు. స్పెషల్ పోస్టర్ విడుదల చేస్తూ గణాంకాలను రివీల్ చేశారు. అఖండ 2 మేకర్స్ అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం, వరల్డ్ వైడ్ గా ఆ సినిమా తొలి రోజు రూ.59.5 కోట్లకు పైగా వసూలు చేసింది. ప్రీమియర్స్ తో కలిపి అన్ని కోట్లు సాధించింది.

మేకర్స్ ప్రకటన ప్రకారం, అఖండ 2 అరుదైన ఘనత సాధించింది. బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచింది. అదే సమయంలో తొలిరోజు వసూళ్లు రివీల్ అవ్వగా.. ఇప్పుడు రెండో రోజుకు ప్రీ బుకింగ్స్ బాగానే జరిగినట్లు తెలుస్తోంది. దానికి తోడు వీకెండ్ కాబట్టి మంచి కలెక్షన్స్ సాధించేలా కనిపిస్తోంది.

ఇక సినిమా విషయానికొస్తే.. అఖండకు గాను దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి బాలయ్యతో వర్క్ చేశారు. ఇప్పటి వారి కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ మూవీలు రాగా.. ఇప్పుడు అఖండ 2 తాండవం రూపొందింది. సినిమాలో బాలయ్య సరసన యంగ్ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించారు.

ఆది పినిశెట్టి విలన్ గా కనిపించగా.. హర్షాలీ మల్హోత్రా, జగపతిబాబు, కబీర్‌ దుహాన్‌ సింగ్‌, శ్వాస్థ ఛటర్జీ, రాన్సన్‌ విన్సెంట్‌, అచ్యుత్‌ కుమార్‌ సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌ మ్యూజిక్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. సినిమాటోగ్రఫీ సి.రామ్‌ ప్రసాద్‌ నిర్వహించారు.

మూవీ ఎడిటింగ్‌ బాధ్యతలను తమ్మిరాజు నిర్వర్తించారు. బాలయ్య కుమార్తె ఎం. తేజస్విని నందమూరి ప్రెజెంటర్ గా వ్యవహరించారు. 14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట రూపొందించారు. ఇషాన్ సక్సేనా కూడా మరో నిర్మాతగా వ్యవహరించారు. మరి ఇప్పుడు అఖండ 2 మూవీ ఓవరాల్ గా ఎంత వసూళ్లను సాధిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News