అఖండ 2: ఆ సెంటిమెంట్ బ్రేక్ అవుతుందా?
అదే డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. మేకర్స్ అన్ని సమస్యలను పరిష్కరించుకుని థియేటర్లలోకి దిగుతున్నారు.;
గత కొన్ని రోజులుగా నందమూరి అభిమానులను, ఇండస్ట్రీ వర్గాలను టెన్షన్ పెట్టిన 'అఖండ 2' ఎపిసోడ్ ఎట్టకేలకు సుఖాంతం అయ్యింది. ఆర్థిక లావాదేవీల వివాదం, కోర్టు కేసులన్నీ ఒక కొలిక్కి వచ్చాయి. ఏ తేదీన అయితే సినిమా రావాలని అనుకున్నారో, అదే డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి లైన్ క్లియర్ అయ్యింది. మేకర్స్ అన్ని సమస్యలను పరిష్కరించుకుని థియేటర్లలోకి దిగుతున్నారు.
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో కొన్ని నమ్మకాలు బలంగా ఉంటాయి. విడుదల సమయంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, రిలీజ్ ఆగిపోయి లేట్ గా వచ్చినా అది సినిమా ఫలితంపై ప్రభావం చూపుతుందని ఒక అపోహ ఉంది. రిలీజ్ గండాలు దాటి వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడతాయని, అది ఒక బ్యాడ్ సెంటిమెంట్ అని చాలామంది భావిస్తుంటారు. గతంలో ఇలా జరిగి కొన్ని సినిమాలు దెబ్బతిన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ ప్రతిసారీ ఇదే జరుగుతుందని రూల్ ఏమీ లేదు. కంటెంట్ లో దమ్ముంటే రిలీజ్ టైమ్ లో వచ్చే సమస్యలు సినిమాను ఏం చేయలేవు. ఇందుకు బెస్ట్ ఉదాహరణ మాస్ మహారాజా రవితేజ నటించిన 'క్రాక్'. ఆ సినిమాకు కూడా ఫైనాన్షియల్ సమస్యల వల్ల మార్నింగ్ షోలు పడలేదు. ఒక రోజు ఆలస్యంగా ఆటలు మొదలయ్యాయి. అయినా సరే కంటెంట్ బాగుండటంతో ఆ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అఖండ 2 కూడా ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉంది.
అయితే బాలయ్య సినిమా ముందున్న లక్ష్యం చాలా పెద్దది. బయట వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్లు. ఇంత భారీ మొత్తం వెనక్కి రావాలంటే సినిమాకు జస్ట్ హిట్ టాక్ వస్తే సరిపోదు. మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. ఏ మాత్రం డివైడ్ టాక్ వచ్చినా, లేదంటే యావరేజ్ అనిపించుకున్నా బయ్యర్లు సేఫ్ జోన్ లోకి రావడం కష్టమవుతుంది.
పైగా ఇలాంటి వివాదాల తర్వాత సినిమా వస్తున్నప్పుడు ఆడియెన్స్ లో ఒకరకమైన అనుమానం ఉంటుంది. దాన్ని పటాపంచలు చేస్తూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ స్టడీగా ఉండేలా చూసుకోవాలి. అఖండ మొదటి పార్ట్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల ఓపెనింగ్స్ కు డోకా ఉండకపోవచ్చు. కానీ ఆ తర్వాత నిలబడాలన్నా, బ్రేక్ ఈవెన్ సాధించాలన్నా సినిమా రేంజ్ వేరే లెవెల్ లో ఉండాలి.
ఏదేమైనా అడ్డంకులన్నీ తొలగిపోయాయి కాబట్టి, ఇక అసలు పరీక్ష కంటెంట్ దే. బోయపాటి మరోసారి ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తే, ఈ ప్రీ రిలీజ్ గొడవలేవీ సినిమా విజయానికి అడ్డుకావు. మరి బాక్సాఫీస్ టార్గెట్ ను బాలయ్య ఎలా రీచ్ అవుతారో, ఆ బ్యాడ్ సెంటిమెంట్ ను ఎలా తిప్పికొడతారో చూడాలి.