అఖండ 2 అన్నీ తానైన బాలయ్య..!
బాలకృష్ణ కెరీర్ లో అఖండ 2 స్పెషల్ మూవీ కాబోతుంది. శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు.;
బాలకృష్ణ కెరీర్ లో అఖండ 2 స్పెషల్ మూవీ కాబోతుంది. శుక్రవారం రిలీజ్ అవబోతున్న ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితం వచ్చిన అఖండ సినిమా సూపర్ హిట్ కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా అఖండ 2 నెక్స్ట్ లెవెల్ బజ్ తో వస్తుంది. ఈ సినిమాలో ముఖ్యంగా ఆధ్యాత్మికతకు పెద్ద పీట వేసినట్టు తెలుస్తుంది. అందుకే సినిమాకు నేషనల్ లెవెల్ లో రీచింగ్ ఉంటుందని భావిస్తున్నారు.
అఖండ 2 పాన్ ఇండియా రిలీజ్..
ఇక అఖండ 2 ప్రమోషన్స్ లో కూడా బాలయ్య స్పెషల్ ఇంట్రెస్ట్ సినిమాపై మరింత బజ్ పెంచుతుంది. సీనియర్ హీరో బాలయ్య తన సినిమాకు అన్నీ తానై నడిపిస్తున్నాడు. అఖండ 2 పాన్ ఇండియా రిలీజ్ కోసం ముంబై, చెన్నై ఈవెంట్స్ లో పాల్గొన్నారు. అక్కడ మీడియా మీట్ లో కూడా చురుగ్గా ఉంటున్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ రెండిటిలో బాలకృష్ణ మాట్లాడటం అక్కడ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది.
అఖండ 2 సినిమాలో ఉన్న కాన్సెప్ట్ నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పిస్తుందని ఫిక్స్ అయ్యి ఈ సినిమాను పాన్ ఇండియా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాపై బాలకృష్ణ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. సినిమా నుంచి రిలీజైన ట్రైలర్ ఇప్పటికే అంచనాలు పెంచగా నెక్స్ట్ సాంగ్స్ కూడా సూపర్ అనిపించాయి. అఖండ 2 సెట్స్ మీదకు వెళ్లినప్పటి నుంచి రిలీజ్ ప్రమోషన్స్ వరకు బోయపాటి ఎంత వర్క్ చేశాడో దానికి ఈక్వల్ గా బాలకృష్ణ ఎఫర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే అఖండ 2 ని బాలయ్య చాలా ఓన్ చేసుకున్నారనిపిస్తుంది.
బాలయ్యతో సినిమా బోయపాటి సీక్రెట్..
14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన అఖండ 2 సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో బాలయ్యతో ఆది పినిశెట్టి ఢీ కొడుతున్నాడు. బోయపాటి బాలయ్య కాంబో సినిమా అంటే మాస్ ప్రియులకు పండగ అన్నట్టే లెక్క. అఖండ 2 కోసం యాక్షన్ సీన్స్ కూడా అదిరిపోతాయని తెలుస్తుంది. ఇక బాలయ్య తొలిసారి తన సినిమా ప్రమోషన్స్ కి ముంబై, చెన్నై వెళ్లడం అక్కడ నందమూరి ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది.
బాలయ్యతో సినిమా బోయపాటి సీక్రెట్ ఏంటంటే.. 10 నిమిషాల్లో కథ చర్చించి సినిమా ఓకే చేస్తామని బాలయ్య చెప్పడం బోయపాటిపై ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటన్నది చెబుతుంది. ఇక మా ఇద్దరితో పాటు థమన్ ని ఆ దైవం మాతో కలిసి పనిచేసేలా చేస్తుందని బాలయ్య అన్నారు.