బాలయ్యకు పోటీగా ఒకే ఒక్కడు!
రణవీర్ సింగ్ నుంచి రెండేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రమిది. సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన చిత్రమిది.;
నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా నటిస్తోన్న `అఖండ 2` భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో ఇదే తొలి పాన్ ఇండియా రిలీజ్. నార్త్ బెల్ట్ లో బాలయ్య ఇమేజ్ నేపథ్యంలో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ స్క్రీన్లలో రిలీజ్ అయ్యేలా సన్నాహాలు చేస్తున్నారు. అయితే టాలీవుడ్ నుంచి బాలయ్యకు తిరుగు లేదు. డిసెంబర్ 5న రిలీజ్ అవుతున్న చిత్రానికి టాలీవుడ్ నుంచి ఎలాంటి పోటీ లేదు. బాలయ్య సోలోగా బాక్సాపీస్ ను దున్నుకోవొచ్చు.
ఆ రోజు `అఖండ2` రిలీజ్ ఉండటంతో రిలీజ్ చేద్దామనుకున్నచిన్నా చితకా సినిమాలన్నీ వాయిదా పడ్డాయి. హిట్ టాక్ వచ్చిందంటే బాక్సాఫీస్ వసూళ్ల లెక్క గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే వంద కోట్ల క్లబ్ లోకి చేరిన బాలయ్య ఈ విజయంతో కొత్త రికార్డులు నమోదు చేస్తాడని అంచనాలున్నాయి. అయితే అదే రోజున నార్త్ మార్కెట్ లో మాత్రం బాలయ్యకు గట్టి పోటీ తప్పదు. డిసెంబర్ 5న రణవీర్ సింగ్ కథానాయకుడిగా నటిస్తోన్న `దురంధర్` రిలీజ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న చిత్రమిది.
రణవీర్ సింగ్ నుంచి రెండేళ్ల తర్వాత రిలీజ్ అవుతున్న చిత్రమిది. సంజయ్ దత్, మాధవన్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన చిత్రమిది. ఇలాంటి చిత్రంతో నార్త్ లో బాలయ్య అఖండ 2 పోటీ పడాల్సిన సన్నివేశం ఎదురైంది. అయితే `అఖండ 2` హిందుత్వం కాన్సెప్ట్ కావడంతో? కనెక్ట్ అయితే ప్రత్యర్ధి ఎంత బలవంతుడైనా సునాయాసంగా ఢీ కొట్టే అవకాశం ఉంది. నార్త్ మార్కెట్ లో సినిమాకు ఇదే కీలకమైన అంశం. హిట్ టాక్ తెచ్చుకుంటే బాలయ్య సోలోగా శివ తాండవం ఆడస్తాడు.
బాక్సాఫీస్ నుంచి రికార్డు ఫిగర్ వసూల్ నమోదవుతుంది ట్రేడ్ వర్గాలు సైతం అంచనా వేస్తున్నాయి. ఇక ధురంధర్ ఆదిత్య ధర్ తెరకెక్కిస్తోన్న యాక్షన్ థ్రిల్లర్. సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిది. మధ్యలో పలు సినిమాలకు రైటర్ గా పని చేసారు. ఆ సినిమాలు మంచి విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో ధురంధర్ పైఅం చనాలు అంతకంతకు రెట్టింపు అవుతున్నాయి. భారీ విజయం సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.