అఖండ 2 ట్రైలర్ టాక్: దుష్ట శక్తులపై బాలయ్య శివ తాండవం

అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సీక్వెల్ 'అఖండ 2: తాండవం' పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.;

Update: 2025-11-21 16:23 GMT

అఖండ విజయం తర్వాత నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న సీక్వెల్ 'అఖండ 2: తాండవం' పై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టీజర్ లో చూపించిన కంటెంట్ అంతగా క్లిక్ కాలేదు. కానీ ట్రైలర్ తో బోయపాటి మరింత హై వోల్టేజ్ కంటెంట్ చూపించారు. భక్తి, యాక్షన్, ఎమోషన్.. అన్నీ సమపాళ్లలో కలిపిన ఈ ట్రైలర్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర మరోసారి రికార్డుల వేట ఖాయం అనిపిస్తోంది.

ట్రైలర్ ఆరంభమే అద్భుతమైన విజువల్స్ తో మొదలైంది. ముఖ్యంగా కుంభమేళా, సనాతన ధర్మం అంటూ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా విజువల్ ట్రీట్ ఇవ్వనున్నట్లు అర్ధమవుతుంది. దేవాలయాలు, హిమాలయాల బ్యాక్ డ్రాప్, అఘోరాల సమూహం.. అన్నీ కలిసి ఒక డివైన్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేశాయి. ముఖ్యంగా బాలయ్య అఘోరా గెటప్ లో ఎంట్రీ ఇచ్చిన విధానం గూస్ బంప్స్ తెప్పిస్తుంది. దేశం కోసం దైవం కోసం అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ సినిమాలోని ఇంటెన్సిటీని తెలియజేస్తోంది.

ఈసారి కథలో స్కేల్ పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా, దేశ సరిహద్దుల్లో జరిగే సంఘటనలను కూడా కథలో మిక్స్ చేసినట్లున్నారు. మిలిటరీ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సీన్స్, టెర్రరిజం ఎలిమెంట్స్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి. బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు అఘోరాగా, మరోవైపు పవర్ ఫుల్ పాత్రలో ఆయన వేరియేషన్స్ ఆకట్టుకున్నాయి.

తమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు ప్రాణం పోసింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్ లలో వచ్చే సౌండ్ డిజైన్ థియేటర్ లో విజిల్స్ వేయించేలా ఉంది. బోయపాటి మార్క్ స్లో మోషన్ షాట్స్, గ్రాండియర్ సెట్స్ సినిమా రిచ్ నెస్ ని చూపిస్తున్నాయి. హీరోయిన్ సంయుక్తతో ఆది పినిశెట్టి వంటి భారీ తారాగణం ఇందులో ఉంది. విలన్ గా ఆది ఏదో దుష్ట శక్తుల అధిపతిగా కనిపించడం మరో హైలెట్. ఏకంగా అఘోర మీదకు బుతాలను వదలడం వంటి సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.

ఒక పవర్ ఫుల్ నెగిటివ్ ఫోర్స్ ని బాలయ్య ఢీకొట్టబోతున్నాడని మాత్రం అర్థమవుతోంది. చెడు ఎక్కువైతే అక్కడ అఖండ ఉంటాడు అనే కాన్సెప్ట్ ని ఈసారి మరింత గ్లోబల్ లెవెల్ లో ప్రజెంట్ చేయబోతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఫస్ట్ పార్ట్ కంటే మెరుగ్గా ఉన్నాయనిపిస్తోంది. కాబట్టి పాన్ ఇండియా రేంజ్ కి సరిపోయే అంశాలు ఉన్నట్లు అర్ధమవుతుంది. నిర్మాణ సంస్థ 14 రీల్స్ భారీగానే ఖర్చు చేసినట్లు అర్ధమవుతుంది. మొత్తానికి 'అఖండ 2' ట్రైలర్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంది. మాస్ ఆడియన్స్ కి కావాల్సిన ఎలివేషన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ కి కావాల్సిన సెంటిమెంట్, డివోషనల్ టచ్.. అన్నీ ఇందులో ఉన్నాయి. డిసెంబర్ 5న రిలీజ్ కానున్న ఈ సినిమా, 'అఖండ' రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది చూడాలి.


Full View


Tags:    

Similar News