బాలయ్య 'అఖండ-2'.. అక్కడే తొలి అడుగు..

తాండవం సాంగ్ ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ అయిందని తెలిపిన తమన్.. పాట ఫుల్ పవర్ ఫుల్ గా ఉంటుందని అంచనాలు పెంచారు.;

Update: 2025-11-12 16:10 GMT

టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ.. అఖండ 2 తాండవం మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విషయం తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆ సినిమా.. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన టీజర్, గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. రీసెంట్ గా మేకర్స్ రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ తాండవం సాంగ్ ప్రోమో ఓ రేంజ్ లో అలరించింది. మ్యూజిక్ లవర్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. సాంగ్ పై పెద్ద ఎత్తున ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది.

అయితే అఖండ మూవీలోని సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అందరినీ మంత్ర ముగ్ధులను చేసిన స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్.. ఇప్పుడు అఖండ 2తో మరోసారి అదరగొట్టేలా కనిపిస్తున్నారు. పవర్ ఫుల్, డివైన్ మోడ్ లో అలరించనున్నట్లు తాండవం సాంగ్ ప్రోమో ద్వారా ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది.

తమన్ కంపోజ్ చేసిన ది తాండవం సాంగ్ ను దిగ్గజ గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ ఆలపించారు. ఏదేమైనా సాంగ్ కోసం ఇప్పుడు అంతా వెయిట్ చేస్తుండగా.. మరో రెండు రోజుల్లో పాట విడుదల అవ్వనుంది. ఈ నేపథ్యంలో తమన్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. స్పెషల్ మీడియా రిలీజ్ చేశారు.

తాండవం సాంగ్ ఫైనల్ మిక్సింగ్ కంప్లీట్ అయిందని తెలిపిన తమన్.. పాట ఫుల్ పవర్ ఫుల్ గా ఉంటుందని అంచనాలు పెంచారు. అదిరిపోయే బీట్ తో అందరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు. అదే సమయంలో తాండవం సాంగ్ ను ముంబైలో రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు. జుహులోని పీవీఆర్ మాల్ లో విడుదల చేయనున్నామని ప్రకటించారు.

ఇద్దరు గొప్ప గాయకులు శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ కలిసి పాడిన తాండవం సాంగ్ ను వినేందుకు ఎంతో ఉత్సాహంగా ఉందని తమన్ వీడియోలో తెలిపారు. అయితే పాన్ ఇండియా రేంజ్ లో విడుదల అవ్వనున్న అఖండ ది తాండవం మూవీ ప్రమోషన్స్ తొలి అడుగు నార్త్ లో పడనుందన్నమాట. ఫస్ట్ సింగిల్ మంచి రెస్పాన్స్ అందుకుని మేకర్స్ లో జోష్ నింపుతుందనే అంచనాలు ఉన్నాయి. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News