3Dలో బాలయ్య తాండవం! గూస్‌బంప్స్ కన్ఫర్మ్
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు;
నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అఖండ2 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. దానికి తోడు బాలయ్య- బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి హిట్లుగా నిలవడంతో అఖండ2 పై భారీ క్రేజ్ నెలకొంది.
పాన్ ఇండియా స్థాయిలో అఖండ2 రిలీజ్
ఈ ఇయర్ టాలీవుడ్ నుంచి రానున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో అఖండ2: తాండవం కూడా ఒకటి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అఖండ2 ను ఈసారి చాలా భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అఖండ సినిమాకు చేసిన పొరపాటును ఈ సినిమాకు చేయకూడదని డిసైడైన దర్శకనిర్మాతలు అఖండ2ను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
త్రీడీ ఫార్మాట్ లో అఖండ2
అందులో భాగంగానే అఖండ2 ప్రమోషన్స్ ను చాలా భారీ స్థాయిలో ప్లాన్ చేసిన మేకర్స్, రీసెంట్ గా ఫస్ట్ సింగిల్ ను ముంబై లో ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి అక్కడ లాంచ్ చేశారు. అంతేకాదు, ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ముఖ్యమైన అప్డేట్ వినిపిస్తోంది. ఆడియన్స్ కు గొప్ప ఎక్స్‌పీరియెన్స్ ను అందించడానికి మేకర్స్ అఖండ2ను 3డీ ఫార్మాట్ లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ అప్‌గ్రేడ్ చేసిన కొన్ని త్రీడీ వెర్షన్ విజువల్స్ ను మీడియా మిత్రులకు, ఫ్యాన్స్ కు చూపించగా, ఆ విజువల్స్, త్రీడీలో యాక్షన్ సీన్స్ ను చూసి విజువల్స్ ఎంతో క్వాలిటీగా ఉన్నాయని, బోయపాటి విజన్ ఎంతో అద్భుతంగా ఉందని, బాలయ్య స్క్రీన్స్ ప్రెజెన్స్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించేలా ఉందని వారు ప్రశంసించారు.
అఖండ2 కు భారీ స్థాయిలో ప్రమోషన్లు
అఖండ2 ను మేకర్స్ ఎంత భారీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారో ఈ ప్లానింగ్ చూస్తుంటే అర్థమవుతుంది. పైగా ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్స్ ను కూడా అన్నీ పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ నెల 21న బెంగుళూరు దగ్గర్లోని చింతామణిలో ట్రైలర్ ను లాంచ్ చేసి, 18న వైజాగ్ జగదాంబలో ఓ సాంగ్ ను లాంచ్ చేయాలని, ఆ తర్వాత డిసెంబర్ 3,4,5 తేదీల్లో అమెరికాలో కూడా ఈవెంట్స్ ను ప్లాన్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని, ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మాత్రం మధ్యలో ఓ రోజు చూసుకుని ఆంధ్రప్రదేశ్ లో చేయాలని భావిస్తున్నారట. మేకర్స్ ప్లాన్ చూస్తుంటే ఈసారి బాలయ్య సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే తాండవం చేసేట్టున్నారు. సంయుక్త మీనన్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో ఆది పినిశెట్టి విలన్ గా కనిపించనుండగా, తమన్ అఖండ2కు సంగీతం అందిస్తున్నారు.