అమ్మను చూసి మురిసిపోయిన‌ యువరాణి!

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా జరిగిన డిన్నర్ ఈవెంట్ ,హోటల్ ప్రాంగణంలో ఐశ్వర్యా రాయ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

Update: 2026-05-25 07:55 GMT

కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా బాలీవుడ్ స్టార్ నటి, మాజీ విశ్వసుందరి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తనదైన శైలిలో సందడి చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈసారి ఐశ్వర్య లుక్స్ మాత్రమే కాకుండా ఆమె వెంట వచ్చిన కూతురు ఆరాధ్య బచ్చన్ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. కాన్స్ వేడుకల సందర్భంగా హోటల్ వెలుపల ఐశ్వర్య అభిమానులతో ముచ్చటిస్తున్న సమయంలో ఆరాధ్య ఇచ్చిన ఓ క్యూట్ రియాక్షన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో భాగంగా జరిగిన డిన్నర్ ఈవెంట్ ,హోటల్ ప్రాంగణంలో ఐశ్వర్యా రాయ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు.

కఠినమైన భద్రత ఉన్నా? ఐశ్వర్య ఏమాత్రం మొహమాటపడకుండా ఫ్యాన్స్ దగ్గరకు వెళ్లి ఎంతో ఆప్యాయంగా పలకరించారు. వారిని నవ్వుతూ పలకరిస్తూ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. వారితో కలిసి సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఒక అంతర్జాతీయ సూపర్ స్టార్ అయినా? తన అభిమానుల పట్ల ఆమె చూపిన వినయం, మర్యాద అక్కడున్న వారందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐశ్వర్య తన అభిమానులతో ఎంతో వినమ్రంగా మాట్లాడుతున్న ఆ క్షణంలో పక్కనే నిలబడిన 14 ఏళ్ల కుమార్తె ఆరాధ్య బచ్చన్ తన తల్లిని ఎంతో గర్వంగా, ప్రేమగా చూస్తూ ఉండిపోయింది. తన తల్లికి అంతర్జాతీయంగా లభిస్తున్న ఆదరణను చూసి ఆరాధ్య ముఖంలో అందమైన చిరునవ్వు వెలిగింది.

సాధారణ అభిమానిలా తన తల్లి స్టార్‌డమ్‌ను - ఆమె నడవడికను ఆరాధ్య ఎంతో మురిపెంగా గమనిస్తున్న దృశ్యాలు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటున్నాయి. ఈ అరుదైన హృదయపూర్వక వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడమే ఆలస్యం.. క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. `ఐశ్వర్య స్క్రీన్ మీదే కాదు. నిజ జీవితంలోనూ రియల్ క్వీన్.. అందుకే ఆమెను చూసి కూతురు అంతగా గర్వపడుతోంది అని ఒకరు రాయగా, `అమ్మను చూసి మురిసిపోతున్న యువరాణి ఆరాధ్య` అంటూ మరికొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తల్లికూతుళ్ల మధ్య ఉన్న ఈ అందమైన అనుబంధం ఈసారి కాన్స్ వేడుకల్లోనే అత్యంత ఎమోషనల్ బాలీవుడ్ మూమెంట్‌గా నిలిచింది. వాస్తవానికి ప్రతి సంవత్సరం ఆరాధ్య తన తల్లి ఐశ్వర్యతో కలిసి కాన్స్ పర్యటనకు వెళ్తున్నా? ఈ ఏడాది ఆమె ప్రయాణం మరింత ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే తల్లి వెనకాలే వచ్చే చిన్నారిలా కాకుండా ఈసారి ఆరాధ్య కూడా రెడ్ కార్పెట్ ఈవెంట్‌లో అధికారికంగా అడుగుపెట్టింది. రెడ్ శాటిన్ గౌను ధరించి, కెమెరాల ముందుకు వచ్చి ఐశ్వర్యతో సమానంగా అఫీషియల్ ఫోటోకాల్‌కు ఫోజులిచ్చింది. దీంతో ఆరాధ్య కాన్స్ ప్రయాణం పూర్తి స్థాయి సెలబ్రిటీ హోదాకు చేరుకుందని తెలుస్తోంది.



Tags:    

Similar News