ఇసుకలో స్నానమాడిన బికినీ గాళ్ ఐషా శర్మ
బికినీ బీచ్ లో చిల్ చేయడంలో శర్మా గాళ్స్ తర్వాతే. చిరుత గాళ్ నేహా శర్మ- ఐషా శర్మ సిస్టర్స్ బీచ్ బికినీ ట్రీట్ కి నెటిజనులు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉన్నారు.;
బికినీ బీచ్ లో చిల్ చేయడంలో శర్మా గాళ్స్ తర్వాతే. చిరుత గాళ్ నేహా శర్మ- ఐషా శర్మ సిస్టర్స్ బీచ్ బికినీ ట్రీట్ కి నెటిజనులు ఎప్పుడూ ఫిదా అవుతూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి ఐషా శర్మ స్పెషల్ బికినీ ట్రీట్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది. ఐషా సంక్రాంతికి ముందు, స్పెషల్ ఫోటోషూట్ లో పాల్గొంది. ఐషా బీచ్ ఇసుకలో స్నానమాడిన స్పెషల్ ఫోటోగ్రాఫ్ తో పాటు బికినీలో దుమారం రేపిన ఫోటోలు, తన సోదరి నేహా శర్మతో కలిసి సరదాగా చిల్ అవుతున్న ఫోటోలు ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి.
అసలు ఐషా నేపథ్యం ఏమిటి? అంటే... శర్మా సిస్టర్స్ బీహార్ కి చెందిన కాంగ్రెస్ నాయకుడి కుమార్తె. ఐషా శర్మ 25 జనవరి 1989న బీహార్‌లోని భాగల్పూర్‌లో జన్మించారు. తండ్రి అజిత్ శర్మ బీహార్‌లో ప్రముఖ రాజకీయ నాయకుడు.
ఇటీవల ఎన్నికల్లోను క్యాంపెయినింగ్ చేసారు.. కానీ రిజల్ట్ నెగెటివ్ గా వచ్చింది. ఇక ఐషాశర్మ మోడల్ గా నటిగా పాపులరైంది. అయితే నటనా కెరీర్ ఆశించిన రేంజుకు చేరుకోకపోవడంతో కొంత నిరాశలో ఉందనే చెప్పాలి.
దిల్లీలోని స్ప్రింగ్‌డేల్స్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన నేహా అనంతరం నోయిడాలోని అమిటీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో బయోటెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందారు. ఐషా తన కెరీర్‌ను మోడల్‌గా ప్రారంభించారు. లాక్మే, పెప్సీ, క్యాంపస్ షూస్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు మోడల్‌గా పనిచేశారు. 2016లో ప్రతిష్టాత్మకమైన కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్స్‌లో ఒకరిగా ఆమె ఎంపికయ్యారు. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నటించిన `ఇక్ వారి` అనే మ్యూజిక్ వీడియో తనకు మంచి గుర్తింపునిచ్చింది. అటుపై 2018లో జాన్ అబ్రహం హీరోగా వచ్చిన `సత్యమేవ జయతే` చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఇందులో `శిఖ` అనే పాత్రను ఐషా పోషించింది. 2022లో తన సోదరి నేహా శర్మతో కలిసి `షైనింగ్ విత్ ది శర్మాస్` అనే రియాలిటీ సిరీస్‌లో కనిపించారు.
ఫిట్నెస్ ఫ్రీక్
ముఖ్యంగా ఐషా శర్మ ఫిట్ నెస్ ఫ్రీక్. శరీరాకృతి విషయంలో చాలా శ్రద్ధ వహిస్తారు. రెగ్యులర్‌గా తన వర్కౌట్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. పుస్తకాలు చదవడం, యోగా, ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టం. ప్రస్తుతం సోషల్ మీడియాలు, ఇన్‌స్టాగ్రామ్‌లో ఐషాకు లక్షలాదిగా ఫాలోవర్లు ఉన్నారు.
కెరీర్ మ్యాటర్...
ఐషా శర్మకు 2026 బాగానే కలిసొచ్చేట్టుంది. ఎందుకంటే తన కెరీర్ లైనప్ లో బార్డర్ 2 కచ్ఛితంగా రిలీజ్ ముందే హిట్ వైబ్స్ ని ఇస్తోంది. ఇంతకుముందు ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా, దానికి అద్భుత స్పందన లభించింది. అయితే బార్డర్ 2 లో తన పాత్ర ఏమిటన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది. ఇందులో నటిస్తోందా లేదా? అన్నది చిత్రబృందం ఇంకా అధికారికంగా రివీల్ చేయలేదు. అలాగే రాహు కేతు అనే చిత్రంలోను ఐషా నటించింది. ఇటీవల విడుదలైన ఈ ఫాంటసీ కామెడీ చిత్రానికి మిశ్రమ స్పందనలు వచ్చాయి. ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్‌లు, గ్లామరస్ ఫోటోషూట్‌లతో బిజీగా ఉంది శర్మాగాళ్.