యువ తారల సరికొత్త ట్రెండ్!

బాలీవుడ్ యువ తారలు.. స్టార్ కిడ్స్ సోషల్ మీడియా వేదికగా చేసే చిన్న చిన్న పనులు కూడా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి.

Update: 2026-06-14 17:30 GMT

బాలీవుడ్ యువ తారలు.. స్టార్ కిడ్స్ సోషల్ మీడియా వేదికగా చేసే చిన్న చిన్న పనులు కూడా నెట్టింట పెద్ద ఎత్తున వైరల్ అవుతుంటాయి. తాజాగా యువ నటుడు అహాన్ పాండే - నటి అనీత్ పద్దా సరికొత్త ట్రెండ్‌తో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నారు. ఇద్ద‌రు ఒకే రకమైన మ్యాచింగ్ టాటూలు వేయించుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ క్రేజీ అప్‌డేట్ బాలీవుడ్ లవర్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. చిత్ర పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఇచ్చిన ఇద్దరు యువ నటీనటులు మొదటి సినిమాతోనే క్రేజ్ సంపాదించుకోవడం విశేషం.




 


తాజాగా అహాన్ పాండే - అనీత్ పద్దా త‌మ శరీరాలపై ఒకే విధమైన డిజైన్ గల టాటూలను ప్రదర్శించడంతో ఇద్ద‌రి మ‌ధ్య ఉన్న బంధం ఏంటి? అ నే దానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ వినూత్న శైలి యువతను విశేషంగా ఆకట్టుకుంటుంది. జంట‌కు సోషల్ మీడియాలో వ్యూస్ - లైకులు భారీ ఎత్తున వ‌స్తున్నాయి. ఈ మ్యాచింగ్ టాటూల వెనుక అసలు రహస్యం ఏట‌నే దానిపై ఇండస్ట్రీ వర్గాలలో భిన్నమైన విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కొందరు కేవలం వారి వ్యక్తిగత స్నేహానికి .. ప్రేమకు నిదర్శనం అని భావిస్తుంటే.. మరికొందరు మాత్రం ఇది వారి నుంచి రాబోయే ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన వినూత్న ప్రమోషనల్ స్ట్రాటజీ ) అయ్యింటుందని అంచనా వేస్తున్నారు.

నేటి కాలంలో సినిమాలపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ రొటీన్ పద్ధతులను పక్కనబెట్టి ఇలాంటి సరికొత్త మార్గాలను ఎంచుకోవ‌డం తెలిసిందే. ప్రస్తుత డిజిటల్ - ఇంటర్నెట్ యుగంలో సెలబ్రిటీల వ్యక్తిగత శైలి, ఫ్యాషన్ స్టేట్‌మెంట్లు వారి కెరీర్‌ను ఎంతగానో ప్రభావితం చేస్తున్నాయి. చిన్న ఫోటో లేదా హింట్ ద్వారా సోషల్ మీడియాలో పెద్ద తుఫాను సృష్టించవచ్చని అహాన్, అనీత్ ఉదంతం నిరూపించింది. సినిమాల్లో వారి నటన కంటే ముందే.. వారి రియల్ లైఫ్ కెమిస్ట్రీ .. స్టైల్స్ వైపు ప్రేక్షకులు ఆకర్షితులవుతున్నారు. ఇది ఒక రకంగా సినిమా విడుదలకు ముందే ప్రేక్షకులలో బలమైన కనెక్టివిటీని ఏర్పరుస్తుంది.

ముఖ్యంగా నేటి జెన్-జీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడానికి సాంప్రదాయ ప్రెస్ మీట్లు, పోస్టర్ల కంటే ఇలాంటి రియల్ లైఫ్ అప్‌డేట్స్ ఎంతో పవర్‌ఫుల్‌గా పనిచేస్తున్నాయి. టాటూలు, విలక్షణమైన ఫ్యాషన్స్ ద్వారా యువ సెలబ్రిటీలు తమ అభిమానులకు మరింత దగ్గరవుతున్నారు. అహాన్ పాండే, అనీత్ పద్దా ఇద్దరూ లుక్స్ ..ఈ మ్యాచింగ్ టాటూ ట్రెండ్‌తో సరికొత్త స్టైల్ ఐకాన్స్‌గా మారుతున్నారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప్రతిభతో పాటు ఇలాంటి పబ్లిక్ అటెన్షన్ కూడా ఎంతో ప్రివిలేజ్ ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నెట్టింట తుఫాను రేపుతున్న ఈ మ్యాచింగ్ టాటూల ముచ్చట వారి వ్యక్తిగత ఇష్టమా లేక సినిమా స్క్రిప్ట్‌లో భాగమా అనేది పక్కన పెడితే.. ఈ జంట మాత్రం అందరి దృష్టిని ఆకర్షించడంలో వంద శాతం విజయం సాధించింది.

Tags:    

Similar News