అడివి శేష్ 'డెకాయిట్' కాన్ఫిడెన్స్ లెక్క ఇది..!

మార్చి 19న శేష్ సినిమాతో పాటు K.G.F యష్ నటించిన టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. ఐతే శేష్ మాత్రం టాక్సిక్ తో పోటీ పర్వాలేదు అంటున్నాడు.;

Update: 2025-11-06 07:04 GMT

అడివి శేష్ సినిమా ఏదైనా సరే సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. తను తీసే సినిమాల మీద అడివి శేష్ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తాడు. సినిమాకు కాస్త ఎక్కువ టైం తీసుకున్నట్టు అనిపించినా అందుకు తగినట్టుగానే అవుట్ పుట్ ఇస్తాడు. ప్రస్తుతం అడివి శేష్ డెకాయిట్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను అసలైతే ఈ ఇయర్ డిసెంబర్ 25న రిలీజ్ చేయాలని అనుకున్నా అది కాస్త నెక్స్ట్ ఇయర్ మార్చి 19కి వాయిదా పడింది. శానీల్ డియో డైరెక్ట్ చేస్తున్న డెకాయిట్ సినిమాలో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.

సినిమాల మధ్య ఫైట్..

మార్చి 19న శేష్ సినిమాతో పాటు K.G.F యష్ నటించిన టాక్సిక్ కూడా రిలీజ్ అవుతుంది. ఐతే శేష్ మాత్రం టాక్సిక్ తో పోటీ పర్వాలేదు అంటున్నాడు. ఒకేసారి రెండు సినిమాలు వచ్చి సక్సెస్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంతేకాదు టాక్సిక్ సినిమాకు తాను భయపడటం లేదు. సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టేస్తాం అంటూ చెప్పాడు అడివి శేష్.

ఐతే సినిమాల మధ్య ఫైట్ ని బాక్సాఫీస్ వార్ అనే పదం కేవలం మీడియా మాత్రమే సృష్టించిందని అన్నారు అడివి శేష్. ఐతే అవతల ఎంత పెద్ద సినిమా అన్నది కాదు మన సినిమాపై మనకు సూపర్ కాన్ఫిడెన్స్ ఉండాలి. అది అడివి శేష్ కి బోలెడంత ఉంది. ప్రతి సినిమాను కొత్త దారిలో వెళ్తూ కొత్త కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు అడివి శేష్.

డెకాయిట్ సినిమా హీరోయిన్ మార్పు..

డెకాయిట్ సినిమా ముందు ఒక స్టార్ హీరోయిన్ తో మొదలు పెట్టారు. టీజర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఆ హీరోయిన్ కొన్ని కారణాల వల్ల సినిమా నుంచి తప్పుకోగా మళ్లీ ఆమె ప్లేస్ లో మృణాల్ ఠాకూర్ ని తీసుకున్నారు. శేష్ సినిమాను మార్నింగ్ ఆఫర్ చేస్తే ఆఫ్టర్ నూన్ కల్లా మృణాల్ ఓకే అనేసిందని శేష్ రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పాడు. మృణాల్ ఠాకూర్ కూడా తెలుగులో మరిన్ని సినిమాలు చేయాలని చూస్తుంది. డెకాయిట్ తో హిట్ కొట్టి మరోసారి తన సత్తా చాటాలని అనుకుంటుంది.

డెకాయిట్ మాత్రమే కాదు అడివి శేష్ చేస్తున్న గూఢచారి 2 కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుందట. జీ 2 సినిమాపై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. గూఢచారి 2 సినిమాలో అడివి శేష్ తో వామిక గబ్బి జత కడుతుంది. తెలుగు స్పై థ్రిల్లర్ గా ఆడియన్స్ ని అలరించిన గూఢచారి సీక్వెల్ గా ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ని రీచ్ అయ్యే కంటెంట్ తో జీ 2 వస్తుందని తెలుస్తుంది.

Tags:    

Similar News