బాలయ్య వ్యక్తి కాదు.. అందుకే విలన్ గా చేస్తున్నా
ఓ వైపు హీరోగా నటిస్తూ కూడా విలన్ పాత్రలు చేయడంపై కూడా ఆది ఈ సందర్భంగా మాట్లాడారు.;
నందమూరి బాలకృష్ణ పవర్ హౌస్ లాంటి వారంటున్నారు టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ ఆది పినిశెట్టి. బాలకృష్ణ ఒక వ్యక్తి కాదని, ఆయనొక శక్తి అని కామెంట్ చేశారు ఆది. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో నాలుగో సినిమాగా అఖండ2 తాండవం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు.
బాలయ్య ఒక పవర్‌హౌస్
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆది, బాలకృష్ణతో కలిసి వర్క్ చేయడం, ఆ ఎక్స్‌పీరియెన్స్ గురించి మాట్లాడారు. బాలయ్య ఒక పవర్‌హౌస్ అని, ఆయన స్క్రీన్ పై ఎలా కనిపిస్తారో, నిజ జీవితంలోనూ ఆయన వ్యక్తిత్వం అలానే ఉంటుందని, ఆయన దృఢ సంకల్పం, కష్టించి పని చేయాలనే తపన ఎంతోమందికి స్పూర్తినివ్వడంతో పాటూ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
ఆయన డైరెక్షన్ లో మ్యాజిక్ ఉంది
బాలయ్య నుంచి తాను ఎన్నో విషయాలను నేర్చుకున్నానని చెప్పిన ఆది, బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఓ మ్యాజిక్ ఉంటుందని, బాలయ్య- బోయపాటి కాంబోలో సినిమా అంటే అది నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని, అలాంటి సినిమాలో తనకు ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నట్టు ఆది చెప్పుకొచ్చారు. కాగా బోయపాటి దర్శకత్వంలో ఆది గతంలో నటించిన సందర్భాలున్నాయి.
విలన్ పాత్రలకు లిమిట్స్ ఉండవు
ఓ వైపు హీరోగా నటిస్తూ కూడా విలన్ పాత్రలు చేయడంపై కూడా ఆది ఈ సందర్భంగా మాట్లాడారు. మనిషిలో మంచీ, చెడూ రెండూ ఉంటాయని, పాజిటివ్ పాత్రలు మాత్రమే చేస్తుంటే కొంతకాలానికి వాటిపై ఇంట్రెస్ట్ తగ్గుతుందని, కానీ విలన్ క్యారెక్టర్లకు ఎలాంటి లిమిట్స్ ఉండవని, పైగా విలన్ క్యారెక్టర్ లో నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుందని, అందుకే విలన్ క్యారెక్టర్లు ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని పేర్కొన్నారు ఆది.
ఎక్కువవుతున్న వాయిదా వార్తలు
ఇక అఖండ2 విషయానికొస్తే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ లేటవుతుందని, సినిమా వాయిదా పడటం తప్పదని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రగ్యా జైస్వాల్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.