అధిరా ఫస్ట్ లుక్: కల్యాణ్ దాసరి, SJ సూర్య వైల్డ్ టచ్
డిఫరెంట్ కథలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోసారి ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే అప్డేట్ ఇచ్చాడు.;
డిఫరెంట్ కథలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోసారి ఆడియెన్స్ ను ఎట్రాక్ట్ చేసే అప్డేట్ ఇచ్చాడు. తెలుగు సూపర్ హీరో సినిమాలకు కొత్త జోష్ ఇచ్చిన ఈ దర్శకుడు ఇప్పుడు అధిరాతో మరో భారీ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకువస్తున్నాడు. హనుమాన్ సెన్సేషన్ తర్వాత PVCUలో వస్తున్న ఈ సినిమా మీద ఊహించని రేంజ్‌లో ఆసక్తి పెరిగింది.
ఇక లేటెస్ట్ గా విడుదలైన పోస్టర్ మాత్రం సినిమా క్రేజ్‌ని రెట్టింపు చేసింది. హీరోగా కల్యాణ్ దాసరి ఎంట్రీ ఈ సినిమాకి హైలైట్ అవుతుండగా, విలన్‌గా SJ సూర్య లుక్ ఇప్పటికే వైరల్ అయింది. రాక్షసపు కొమ్ములతో, కర్కశమైన చూపుతో కనిపించిన అతని రూపం ఆడియన్స్‌కి షాక్ ఇచ్చింది. మరోవైపు కల్యాణ్ దాసరి సూపర్ హీరో గేర్‌లో పవర్‌ఫుల్ లుక్‌తో నిలబడి ఉండటం, మెరుపులు, అగ్నిపర్వతం బ్యాక్‌డ్రాప్‌లో ఉండటం పోస్టర్‌ని హై రేంజ్ విజువల్‌లా మార్చేశాయి.
రెగ్యులర్ ఫస్ట్ లుక్ తరహాలో అనిపించకుండా, మంచి చెడు పోరాటం ఎలా ఉండబోతోందో ఈ పోస్టర్‌నే స్పష్టంగా చూపించింది. సోషల్ మీడియాలో ఇది హాట్ టాపిక్ అవుతుండగా, యూత్‌లో మాత్రం పెద్ద ఎక్స్‌పెక్టేషన్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే అభిమానులు అధిరా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని కౌంట్‌డౌన్ స్టార్ట్ చేసినట్టే ఫీల్ ఇస్తోంది.
ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తుండగా, నిర్మాత రివాజ్ రమేష్ దుగ్గల్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. సినిమాటోగ్రాఫర్ శివేంద్ర, హనుమాన్లో అద్భుత విజువల్స్ ఇచ్చిన ఆయన మళ్లీ ప్రశాంత్ వర్మతో కలిసాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా శ్రీచరణ్ పాకాల అందిస్తున్న బీజీఎం కూడా సినిమాకి మేజర్ అసెట్ కానుంది.
సెట్ డిజైన్స్ విషయంలోనూ, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలోనూ హాలీవుడ్ స్టైల్ అప్రోచ్ తీసుకుంటున్నారని సమాచారం. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీ నాగేంద్ర తంగాల రూపొందిస్తున్న సెట్‌లు ఇప్పటి వరకే ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. యాక్షన్ సీన్స్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ప్లాన్ అవుతున్నాయి. మొత్తానికి అధిరాతో కల్యాణ్ దాసరి పవర్ఫుల్ సూపర్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయం అనిపిస్తోంది. సూర్య పవర్ఫుల్ విలన్ గా ఎనర్జీ ఇస్తుండగా, ప్రశాంత్ వర్మ విజన్‌తో ఈ సినిమా కొత్త లెవెల్‌లోకి వెళ్లబోతోంది. ఇప్పుడే ఈ రేంజ్‌లో బజ్ ఉంటే, టీజర్, ట్రైలర్ వస్తే అధిరా పైన క్రేజ్ మరో లెవెల్ కు వెళ్లడం ఖాయం.