ఆదర్శ కుటుంబం : మార్పు కాదు, మొదటి ఎంపిక!

ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న సినిమాగా కూడా ఈ సినిమాను చెప్పుకోవచ్చు.;

Update: 2026-04-29 18:30 GMT

ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఆదర్శ కుటుంబం'. ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్న సినిమాగా కూడా ఈ సినిమాను చెప్పుకోవచ్చు. గత దశాబ్ద కాలంగా వెంకటేష్‌, త్రివిక్రమ్‌ మూవీ వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత వెంకటేష్ ఫుల్‌ జోష్‌ లో ఉన్నాడు. ఆ జోష్‌ కంటిన్యూ చేసే విధంగా ఆదర్శ కుటుంబం సినిమా ఉంటుందనే విశ్వాసంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. త్రివిక్రమ్‌ మ్యాజిక్ చేసి ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమాతో మెస్మరైజ్ చేస్తాడనే నమ్మకంను ఆయన అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ సినిమాలకు త్రివిక్రమ్‌ రైటింగ్‌ చాలా బాగుంటుందని ఈ సినిమాతో మళ్లీ నిరూపితం కాబోతుంది.

ఆదర్శ కుటుంబం సినిమా కోసం...

ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమాను మొదట 2026 సమ్మర్‌లో అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. ఇటీవల సినిమాకు సంగీత దర్శకుడు మారాడు అంటూ వార్తలు వచ్చాయి. మొదట హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ అనే సంగీత దర్శకుడి పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఇప్పుడు ఆ ప్లేస్‌లో థమన్‌ వచ్చి చేరాడు అంటే స్వయంగా సినిమాకు పని చేస్తున్న వారు ఆఫ్‌ ది రికార్డ్‌ చెబుతున్నారు. ఇప్పటికే చాలా మార్పులు చేర్పులు చేస్తున్నారు. అందుకే ఆలస్యం అవుతుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. ఇలాంటి సమయంలో హీరోయిన్‌ పూజిత పొన్నాడను దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ ఎంపిక చేశాడనే వార్తలు వచ్చిన నేపథ్యంలో, సినిమా నుంచి హీరోయిన్‌ను కూడా తప్పించి కొత్తగా మరో హీరోయిన్‌ను ఎంపిక చేశారనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

వెంకటేష్‌, త్రివిక్రమ్‌ కాంబోలో...

పుకార్లపై యూనిట్‌ సభ్యులు అధికారికంగా స్పందించలేదు. కానీ అనధికారికంగా చెబుతున్నదాని ప్రకారం ఆదర్శ కుటుంబం సినిమాలో వెంకటేష్ కు జోడీగా ఇంతకు ముందు అనుకున్నట్లుగా శ్రీనిధి శెట్టి కనిపించబోతుంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న నారా రోహిత్‌ కి జోడీగా పూజిత పొన్నాడ కనిపించబోతుంది. ఆమె పాత్ర పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. అందుకే షూటింగ్‌ చివర్లో జాయిన్‌ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. చిత్ర యూనిట్‌ సభ్యులు ఇప్పటి వరకు సినిమాకు సంబంధించిన సాలిడ్‌ అప్‌డేట్‌ ఇవ్వడం లేదు. కనీసం లీక్‌ కూడా ఇవ్వడం లేదు. దాంతో సినిమాపై రోజు రోజుకు ఆసక్తి కొండలా పెరుగుతుంది. అందుకు తగ్గట్లుగా దర్శకుడు త్రివిక్రమ్‌ సినిమాను ప్లాన్‌ చేస్తాడా అనేది చూడాలి.

శ్రీనిధి శెట్టి, పూజిత పొన్నాడ...

ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌ సినిమాలకు ఈ మధ్య భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం, మన శంకర వరప్రసాద్‌ గారు సినిమాలు ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. కనుక త్రివిక్రమ్‌ సైతం కాస్త ఆ స్టైల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఈ సినిమాను రూపొందిస్తే కచ్చితంగా తెలుగు బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త నెంబర్స్ నమోదు కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వెంకటేష్‌ కి జోడీగా శ్రీనిధి శెట్టి నటిస్తూ ఉంది, ఆమెను తప్పించారనే వార్తలు పూర్తిగా అవాస్తవం. ఆమెను తప్పించకుండానే రోహిత్‌కు జోడీగా నటించడం కోసం పూజిత పొన్నాడను ఎంపిక చేశారని సమాచారం అందుతోంది. అధికారికంగా ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.

Tags:    

Similar News