మంచి ఆఫర్స్ వచ్చినా వదిలేస్తున్న శ్రీలీల
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయోస్ట్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా శ్రీలీల పేరే వినపడుతుంది.;
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీయోస్ట్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా శ్రీలీల పేరే వినపడుతుంది. ఎందుకంటే, ఆమె అన్ని సినిమాల్లో చేస్తోంది. అసలు, విడడుదలకు రెడీగా ఉన్న సినిమాల దగ్గర నుంచి, త్వరలో సెట్స్ మీదకు వెళ్లే సినిమాల వరకు చాలా సినిమాల్లో శ్రీలీలే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, ఇప్పుడు శ్రీలీలకు చాలా పెద్ద కష్టం వచ్చిపడింది.
మంచి మంచి ఆఫర్లు ఆమెకు వస్తున్నా కూడా ఒకే చేయలేని పరిస్థితిలో ఉంది. ఇంతకీ మ్యాటరేంటంటే, శ్రీలీల చేతిలో ప్రస్తుతం డజన్ కి పైగా చిత్రాలు ఉన్నాయి. వాటిలో కొన్ని షూటింగ్స్ అయిపోయాయి. కొన్ని విడుదలకు రెడీగా ఉన్నాయి. మరి కొన్ని సెట్స్ పై ఉన్నాయి. ఈ సెట్స్ పై ఉన్న సినిమాలకే షెడ్యూల్స్ ఇవ్వడం ఆమెకు చాలా కష్టంగా ఉందట.
వాటినే గ్యాప్ లేకుండా, నటిస్తోంది. అలాంటి సమయంలో ఆమెకు మరి కొన్ని సినిమా ఆఫర్లు వచ్చాయి. అయితే, డేట్స్ సర్దుబాటు కాక, వాటిని వదులుకుంటోందట. రీసెంట్ గా విజయ్ దేవర కొండ , గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో శ్రీలీలను హీరోయిన్ గా అనుకున్నారు. కానీ, ఆమె ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుందట. కాల్షీట్స్ లేకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం గమనార్హం.
ఇక, గోపీచంద్ మలినేని సినిమాలో, రవితేజ సినిమాల్లో కూడా ఆఫర్లు వచ్చాయి. వాటిని కూడా ఆమె కాదు అని చెప్పడం గమనార్హం. చాలా మంది హీరోయిన్లు ఆఫర్లు వస్తే బాగుండు అని చూస్తుంటే, శ్రీలల మాత్రం డేట్స్ కుదరక వదిలేసుకుండటం విశేషం. ఇక, విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు, మూవీ ప్రమోషన్స్ బాధ్యత కూడా ఉండటంతో క్రేజీ ఆఫర్స్ ని రిజెక్ట్ చేసేస్తోంది. ఇలాంటి కష్టం మరే హీరోయిన్ కి రాకూడదనే చెప్పాలి.
ఇక, శ్రీలీల ప్రస్తుతం తాను నటించిన స్కంద మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. రామ్ హీరోగా, బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.