డేట్స్ ఇవ్వనంటే చంపేస్తానని బెదిరించారు..!

లేటెస్ట్ గా అలితో సరదాగా షోలో పాల్గొన్న లయ తన కెరీర్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ప్రస్తావించారు. విజయవాడ అమ్మాయి అయిన లయ హీరోయిన్ గా ఎలా మారింది.

Update: 2024-05-23 07:36 GMT

నిన్నటితరం కథానాయిక తెలుగు అమ్మాయి లయ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో హీరోయిన్ గా సక్సెస్ అయిన తెలుగు అమ్మాయిగా లయ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన సినిమాలు హిట్లు, సూపర్ హిట్లు కూడా అయ్యాయి. అయితే కెరీర్ లో కాస్త అవకాశాలు తగ్గాయి అనుకున్న టైం లో పెళ్లి చేసుకుని అమెరికా చెక్కేసింది అమ్మడు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీ ఇస్తుంది లయ. ప్రస్తుతం నితిన్ హీరోగా వేణు శ్రీరాం డైరెక్షన్ లో వస్తున్న తమ్ముడు సినిమాలో లయ సిస్టర్ రోల్ చేస్తుంది.

లేటెస్ట్ గా అలితో సరదాగా షోలో పాల్గొన్న లయ తన కెరీర్ లో జరిగిన కొన్ని విషయాల గురించి ప్రస్తావించారు. విజయవాడ అమ్మాయి అయిన లయ హీరోయిన్ గా ఎలా మారింది. అంటే.. స్టార్ 2000 కంటెస్ట్ రాగానే తనకు తెలియకుండానే పేరెంట్స్ తన ఫోటోలు పంపారు. అందులో సెకండ్ వచ్చిన తనకు విజయవాడలో జరిగిన ఒక ప్రోగ్రాం లో స్వయంవరం టీం చూసి ఆఫర్ ఇచ్చారు. అప్పుడు కూడా పేరెంట్స్ ఓకే అంటేనే చేస్తానని చెప్పా.. అలా వాళ్ల పర్మిషన్ తోనే స్వయంవరం చేశానని అన్నారు లయ.

Read more!

లయ ఫ్యామిలీ గురించి చెబుతూ నాన్న డాక్టర్.. తాను ఒక్కదాన్నే అవ్వడం వల్ల చాలా గారాబంగా పెంచారు. అయితే ఎప్పుడైనా హద్ధు మీరితే మాత్రం కంట్రోల్ లో పెట్టేవాళ్లని అన్నారు లయ. తాను అమెరికా వెళ్లినా ఎప్పటికీ విజయవాడ అమ్మాయినేనని అన్నారు.

తన అమెరికా లైఫ్ గురించి చెప్పిన లయ.. 2007 లో అమెరికా వెళ్లా. పెళ్లి తర్వాత పూర్తిగా ఫ్యామిలీకే టైం కేటాయించాలనుకున్నా.. అలానే చేశా.. పిల్లలు పెరిగి వారి పనులు వారు చేసుకుంటున్నారు. అందుకే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నానని అన్నారు. నితిన్ తో తమ్ముడు సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నానని అన్నారు లయ. మనకు తెలిసినట్టుగా లయ కేవలం మంచి నటి మాత్రమే కాదు మంచి చెక్ చాంపియన్ కూడా.. ఇదే ఇంటర్వ్యూలో కోనెరు హంపి వాళ్ల నాన్న దగ్గర చెక్ నేర్చుకున్న విషయాన్ని చెప్పారు లయ. 7 సార్లు నేషనల్స్ కు వెళ్లి ఒకసారి గెలిచిన విషయాన్ని చెప్పుకొచ్చారు.

ఆమధ్య లయ ఇబ్బందుల్లో ఉందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించారు లయ. రోజూ చూస్తూ ఉంటే ఇలాంటి వార్తలు ఎవరు నమ్మరు. సోషల్ మీడియాకు తాను దూరంగా ఉండటం వల్ల అలాంటి రకరకాల వార్తలు రాశారు. అమెరికాలో టీ అమ్ముకుని బతుకుతున్నట్టు రాసుకొచ్చారుఇ. అది చూసి ఫ్యామిలీతో పాటు తను కూడా చాలా బాధపడ్డానని అన్నారు లయ.

ఇంటర్వ్యూలో భాగంగా ఒక డైరెక్టర్ చంపేస్తానని బెదిరించాడనే విషయాన్ని ప్రస్తావించారు లయ. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక సినిమా చేయడం కుదరదని చెప్పా.. ఆ విషయంలో గొడవ జరిగింది. అప్పుడు డైరెక్టర్ తనను చంపేస్తానని బెదిరించాడు. మీరు చంపినా నేను ఏమీ చేయలేనని చెప్పానని ఆ విషయం గురించి చెప్పారు లయ.

4

కెరీర్ లో కొన్ని సినిమాలు చేయకుండా ఉండాల్సింది అని అనిపించిన సినిమా ఏదైనా ఉందా అన్న ప్రశ్నకు సమాధానంగా ఇప్పటి హీరోయిన్స్ చాలా తెలివైన వారని.. హిట్ తర్వాత దాన్ని మించిన సినిమా చేస్తున్నారు. తన కెరీర్ లో మా బాలాజీ సినిమా చేశాను. అందులో విడో రోల్.. సినిమా బాగున్నా తాను దాన్ని చేయకుండా ఉండాల్సిందని అన్నారు. అలాంటివి రెండు 3 సినిమాలు చేయడం వల్ల తర్వాత సినిమాపై ఎఫెక్ట్ పడుతుందని అనుకున్నా కానీ కుదరలేదు.

తనకు వచ్చిన లవ్ లెటర్స్ గురించి చెప్పారు లయ. కాలేజ్ డేస్ లోనే చాలా లవ్ లెటర్స్ వచ్చాయి. లవ్ లెటర్స్ ఇస్తారనే భయంతో వాలెంటైన్స్ డే కాలేజ్ కి వెళ్లకుండా ఇంట్లో ఉండేదాన్ని.. ఎవరైనా లవ్ లెటర్ ఇస్తే దానికి ఎలా స్పందించాలో కూడా తెలియదు అందుకే అలా చేశానని అన్నారు లయ. ప్రేమించు సినిమా కోసం తాను చాలా కష్టపడ్డానని చెప్పుకొచ్చారు లయ. ఆ సినిమాలో పాత్ర కోసం అంధుల మేనరిజం నేర్చుకున్నా చాలా ప్రాక్టీస్ చేశానని.. ఆ సినిమా డైరెక్టర్ కూడా తనకు చాలా సపోర్ట్ చేశారని అన్నారు లయ.

డైరెక్టర్ కె.విశ్వనాథ్ తో పనిచేయడం గురించి చెబుతూ.. ఆయన సినిమా సెట్ లోకి వెళ్లగానే దైవత్వం కనిపిస్తుంది. మాటల్లో వర్ణించలేని అనుభూతి అది.. విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో సినిమా చేయడం తాను అదృష్టవంతురాలిని అని అన్నారు లయ.

కూతురిని సినిమాల్లోకి తీసుకు రావాలనే ఆలోచన బయట పెట్టారు లయ. అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో చిన్నప్పటి ఇలియానాగా తను చేసింద్. తనకు ఆసక్తి ఉంటే సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నానని లయ అన్నారు.

Tags:    

Similar News