రామ్ చరణ్ సినిమాకు ఆమె నో చెప్పిందట

హీరోయిన్ స్వాసిక లబ్బర్ పందు సినిమాలో చేసిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నితిన్ నటించిన తమ్ముడు మూవీలో కూడా నటించింది.;

Update: 2025-08-25 03:49 GMT

టాలీవుడ్‌లో ప్రస్తుతం భారీ అంచనాలు పెంచుకున్న ప్రాజెక్ట్ పెద్ది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే గ్లింప్స్, షూటింగ్ అప్‌డేట్స్‌తో ఈ సినిమా మీద ఫ్యాన్స్ అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇలాంటి సమయంలో మలయాళ హీరోయిన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

హీరోయిన్ స్వాసిక లబ్బర్ పందు సినిమాలో చేసిన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా నితిన్ నటించిన తమ్ముడు మూవీలో కూడా నటించింది. అయితే తనకు వరుసగా తల్లి పాత్రల ఆఫర్లు వస్తున్నాయని, అందులో ఒకటి రామ్ చరణ్ పెద్ది సినిమా అని స్వాసిక వెల్లడించింది.

“నాకు వరుసగా తల్లి పాత్రలే వస్తున్నాయి. రామ్ చరణ్ అమ్మ పాత్ర చేయమని అడిగినప్పుడు నిజంగా షాక్ అయ్యాను. అది పెద్ది అనే భారీ బడ్జెట్ సినిమా. కానీ ఇప్పుడే అలాంటి రోల్ చేయాలనిపించలేదు. అందుకే నో చెప్పాను. భవిష్యత్తులో పరిస్థితులు బాగుంటే చేయొచ్చు కానీ ఇప్పుడు మాత్రం చేయను” అని స్వాసిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఈ కామెంట్స్ బయటకు రాగానే నెటిజన్లు కూడా షాక్ అయ్యారు. దర్శకుడు బుచ్చిబాబు సనా ఎందుకు అలా కాస్టింగ్ ఆలోచించారో అని ఆశ్చర్యపోతున్నారు. “సోదరి పాత్ర లేదా ఇతర క్యారెక్టర్ అయితే బాగుండేది కానీ తల్లి పాత్ర మాత్రం సరిపడదు” అని సోషల్ మీడియాలో చాలా మంది రియాక్ట్ అవుతున్నారు.

అదే సమయంలో స్వాసిక లబ్బర్ పందులో చేసిన క్యారెక్టర్ చిన్న వయసు నుంచి వయసు మీద పడిన షేడ్స్‌ కలిగి ఉందని, ఆ అనుభవంతోనే ఇలాంటి ఆఫర్లు వస్తున్నాయేమోనని అభిప్రాయపడుతున్నారు. అయినా, ప్రస్తుతం తన కెరీర్‌లో తల్లి పాత్రలకు తాను రెడీ కాదని స్పష్టం చేసింది.

మొత్తానికి, స్వాసిక చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లోనూ, మలయాళ మీడియాలోనూ చర్చకు దారి తీశాయి. రామ్ చరణ్ పెద్ది సినిమా భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్నప్పటికీ, ఈ కాస్టింగ్ ఎపిసోడ్ మాత్రం ఫిల్మ్ నగరంలో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News