నేనేమీ పర్ఫెక్ట్ కాదు, తప్పులు చేశా! కానీ..
రీసెంట్ గా ఎన్డీ టీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్న సమంత ఆ కార్యక్రమంలో తన కెరీర్ తో పాటూ పర్సనల్ విషయాల గురించి కూడా ప్రస్తావించారు.;
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత వివిధ రీజన్స్ తో ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. మయోసైటిస్ కారణంగా సినిమాల నుంచి కాస్త బ్రేక్ తీసుకున్న సమంత, దాన్నుంచి కోలుకుని ఇప్పుడు మళ్లీ స్క్రీన్ పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. కెరీర్లో బిజీ అయ్యేందుకు ప్రయత్నిస్తూ, అందులో భాగంగానే సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో బిజీ అవుతున్నారు.
ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నా
రీసెంట్ గా ఎన్డీ టీవీ వరల్డ్ సమ్మిట్ లో పాల్గొన్న సమంత ఆ కార్యక్రమంలో తన కెరీర్ తో పాటూ పర్సనల్ విషయాల గురించి కూడా ప్రస్తావించారు. తన లైఫ్ లో జరిగిన ప్రతీదీ ప్రజల సమక్షంలోనే జరిగిందని చెప్పిన సమంత, హెల్త్ విషయంలో ఎంతో ఇబ్బంది పడ్డానని, అయినప్పటికీ ఆ టైమ్ లో తనపై ఎన్నో విమర్శలొచ్చాయని, సోషల్ మీడియాలో అలా ఉండబట్టే ఇలా జరిగిందని తీర్పులు కూడా ఇచ్చేశారని, తన లైఫ్ లో జరిగే వాటికి తనక్కూడా ఆన్సర్ తెలియదని, కానీ వాటి గురించే మాట్లాడాల్సి వస్తుందని, తానేమీ పర్ఫెక్ట్ కాదని, తాను కూడా జీవితంలో తప్పులు చేసి ఉండొచ్చని, ఎదురుదెబ్బలు తిన్నానని, కానీ ఇప్పుడు బెటర్ అయ్యానని చెప్పుకొచ్చారు సమంత.
అందుకే పుష్పలో ఐటెం సాంగ్ చేశా
ఎంత స్టార్ హీరోయిన్ అయినప్పటికీ సమంత ఇమేజ్ కు ఓ తరహా పాత్రలే వచ్చేవి. అందుకే ఇమేజ్ మేకింగ్ కంటే సెల్ఫ్ ఛాలెంజ్ ముఖ్యమని భావించిన సమంత తన కెరీర్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే పాత్రలు చేయాలని కోరుకుని అందులో భాగంగానే పుష్పలో ఐటెం సాంగ్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఐటెం సాంగ్ చేయాలనే డెసిషన్ తన పర్సనల్ అని, తన బౌండరీస్ ఏంటో తెలుసుకోవడానికే తాను ఆ సాంగ్ ను చేశానని ఆమె పేర్కొన్నారు.
పట్టించుకోవడం మానేశా
తాను సెక్సీగా ఉంటానని తనకే అనిపించలేదని, అందుకే డైరెక్టర్లు కూడా తనకు బోల్డ్ క్యారెక్టర్లు ఇవ్వలేదని చెప్పిన సమంత, పుష్పలో ఐటెం సాంగ్ రూపంలో తనకు ఛాన్స్ రావడంతో దాన్ని ఛాలెంజ్ గా తీసుకుని తన లిమిట్స్ ఏంటో తెలుసుకోవాలనుకున్నానని, ఎవరూ ఊహించని విధంగా ఊ అంటావా సాంగ్ కు నేషనల్ లెవెల్ లో గుర్తింపు వచ్చిందని సమంత చెప్పారు. గత కొన్నాళ్లుగా తాను అన్నింటినీ పట్టించుకోవడం మానేశానని చెప్తున్న సమంత, క్రమశిక్షణ, ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపారు. ప్రతీ ఒక్కరికీ ఆశయాలు ఉండాలని, ఆ ఆశయాలకు ఓ ఉద్దేశం కూడా తోడవ్వాలని సమంత సూచించారు. కాగా సమంత ఆఖరిగా సిటాడెల్ లో కనిపించారు.