సాటి మహిళ అనే జాలీ కూడా లేదా రేఖాజీ!
తాజాగా మరో సీనియర్ నటి రేఖ జయా బచ్చన్ కు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేసారు.;
సెల్పీ కోసం ప్రయత్నించిన ఓ అభిమాని విషయంలో జయాబచ్చన్ ఎలా ప్రవర్తించారో తెలిసిందే.ఆ సమయంలో జయాజీ సహనం కోల్పోయి ఎంతో కోపంతో రుసరుసలాడుతూ కనిపించారు. ఈ వీడియో క్షణాల్లో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. జయాబచ్చన్ లాంటి ఒక సీనియర్ సిటిజన్ ఇంతటి ఆగ్రహానికి గురి కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె ప్రవర్తనపై నెటిజనులు ఆగ్రహించారు. ఒక సెల్ఫీ కోసం ప్రయత్నించిన వ్యక్తిని అంతగా నిరాశపరచాలా? అవమానించాలా? అని కొందరు ప్రశ్నించారు.
తాజాగా మరో సీనియర్ నటి రేఖ జయా బచ్చన్ కు ఏమాత్రం తక్కువ కాదని ప్రూవ్ చేసారు. మంగళవారం ఉదయం ఓ ఎయిర్ పోర్టులో రేఖతో సెల్పీ కోసం ఓ లేడీ అభిమాని దగ్గరకు వచ్చారు. అప్పటికే రేఖ సీరియస్ గా నడుచుకుంటూ కార్ వద్దకు చేరుకునే హడావుడిలో ఉన్నారు రేఖ. అదే సమయంలో ఆమెకు ఎదురుగా ఓ లేడీ అభిమాని వెళ్లి సెల్పీ ప్లీజ్ అంది. కెమెరా ఆన్ చేసి తీసుకుంటోన్న సమయంలో రేఖ పెదాలపై నవ్వు చూపిస్తూనే సీరియస్ గా మూతి బిగించి ఆ అభిమాని చేతిని వెనక్కి నెట్టేసారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
దీంతో రేఖ తీరును ఉద్దేశించి నెటి జనులు మండి పడుతున్నారు. ఈవిడా జయాబచ్చన్ కు 2.0 లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఎంతో ఆశతో సెల్పీ కోసం వచ్చిన ఆ మహిళ పట్ల రేఖ ప్రవర్తించిన తీరు ఎంత మాత్రం సహేతుకం కాదంటూ మండిపడుతున్నారు. అభిమాని కోసం కొన్ని క్షణాలు కూడా కేటాయించలేరా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అలాగే రేఖ రెండేళ్ల క్రితం ఓ మేల్ అభిమానికి ఇచ్చిన సెల్పీని గుర్తు చేస్తున్నారు. సరిగ్గా రెండేళ్ల క్రితం రేఖ ఓ ఈవెంట్ కి వెళ్లి వస్తున్నారు.
ఆ సమయంలోనూ అంతే సీరియస్ గా నచుడుకుంటూ వస్తుండగా. ఓ 30 ఏళ్ల కుర్రాడు సెల్పీ కావాలంటూ ఆమె ముందుకు వెళ్లబోయాడు. వెళ్లే క్రమంలో అతడిని చూడలేదు. నేరుగా ఆమె ముందుకెళ్లి కెమెరా ఆన్ చేసి ఫోటో తీసుకున్నాడు. అప్పుడా యువకుడి విషయంలో రేఖ ఎంతో పాజిటివ్ గా స్పందించారు. సెల్పీ అనంతరం ఆ కుర్రాడి బుగ్గపై కొంటెగా ఓ లెంపకాయ కూడా వేసి పంపించారు. దీంతో అతగాడి జన్మధన్యమైనంత సంతోషగా ఫీలై వేళ్లాడు. కానీ నేటి సన్నివేశం అందుకు పూర్తి విరుద్దం. సాటి మహిళ అని కూడా చూడుకుండా నిర్ధాక్షణ్యంగా గెట్టేంసినంత పని చేసారు.