ఇద్దరు పిల్లల తల్లి అయినా పెళ్లిపై నోరు విప్పని నటి
ప్రస్తుత తరుణంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కథానాయికలు ఒకటికి రెండుసార్లు ప్రేమలో విఫలమైనా.. చివరకు వివాహ బంధంతో సెటిల్ అవుతున్నారు.;
ప్రస్తుత తరుణంలో సినీ పరిశ్రమకు చెందిన పలువురు కథానాయికలు ఒకటికి రెండుసార్లు ప్రేమలో విఫలమైనా.. చివరకు వివాహ బంధంతో సెటిల్ అవుతున్నారు. కానీ ట్రెడిషనల్ విలువలు కలిగిన భారతీయ సమాజంలో ఉంటూ.. ఇద్దరు పిల్లల తల్లైనా పెళ్లి ప్రస్తావన లేకుండా ముందుకు సాగడం ఒక ప్రముఖ కథానాయిక విషయంలో ఆశ్చర్యం కలిగిస్తోంది. పిల్లలు పెద్దవారవుతున్నా.. ప్రియుడిని పెళ్లాడేందుకు ఆమె ఏమాత్రం సుముఖంగా లేకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పెళ్లి గురించి ఎటువంటి బెంగ లేకుండా.. తనదైన శైలిలో ఈ భామ సాగిస్తున్న ప్రయాణం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
గతంలో ఒక మీడియా సమావేశంలో ఈ నటికి తన వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. తన కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో సోషల్ మీడియాలో వస్తున్న పెళ్లి వార్తల గురించి విలేకరులు ప్రశ్నించారు. ఆ సమయంలో పక్కనే ఉన్న స్టార్ హీరో ఆశ్చర్యంగా `పెళ్ళా?` అని అడగగా సదరు కథానాయిక ఏమాత్రం తడబడకుండా నవ్వుతూ `అవునట కదా!` అని చాలా క్యాజువల్‌గా బదులిచ్చారు. పెళ్లి పుకార్లను ఎదుర్కొన్న తీరు.. తన మొండితనాన్ని, ఆత్మవిశ్వాసాన్ని స్పష్టం చేస్తోంది.
ఇటీవల పెళ్లి పుకార్లపై మరింత వివరణ ఇస్తూ తన వ్యక్తిగత స్వేచ్ఛకే ప్రాధాన్యతనివ్వడం ఆశ్చర్యపరుస్తోంది. ``నేను వృత్తిపరంగా అభివృద్ధి చెందుతున్నానని మీరు చెప్పడం నాకు ఒక కాంప్లిమెంట్‌గా అనిపిస్తోంది. వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నేను ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నాను. నా ప్రైవసీని కాపాడుకోవడానికే నేను మొదటి నుండి ఇష్టపడతాను.. దాని గురించి బహిరంగంగా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు`` అని సున్నితంగా సమాధానమిస్తూ ఆ అంశాన్ని దాటవేశారు. తన జీవితం ప్రపంచానికి కనిపిస్తూనే ఉందని, ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
అయితే గతంలో తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఒక ఫోటో పెద్ద చర్చకు దారితీసింది. క్రిస్మస్ సందర్భంగా పోస్ట్ చేసిన ఆ ఫోటోను `హబ్బీ` (భర్త) తీశారంటూ క్యాప్షన్ ఇవ్వడంతోరహస్యంగా పెళ్లి జరిగిపోయిందని అందరూ భావించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలకు తల్లి అయినా.. అధికారికంగా తన వైవాహిక స్థితిపై వస్తున్న వార్తలపై ఈ నటి మౌనం వహించడం గమనార్హం. దీనివల్ల ఆమె నిజంగా పెళ్లి చేసుకుందా లేదా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలిపోయింది.
ప్రస్తుతం ఈ నటి తన కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నా.. కొంతకాలంగా పెద్దగా సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం తన పూర్తి సమయాన్ని ఇద్దరు పిల్లల బాధ్యతలను నిర్వర్తించడానికే కేటాయిస్తున్నారు. మీడియా ఎన్ని రకాలుగా ప్రశ్నలు సంధించినా.. తన వ్యక్తిగత నిర్ణయాలకు కట్టుబడి ఉంటూ బాధ్యతాయుతమైన తల్లిగా కనిపిస్తున్నారు. వృత్తిని, వ్యక్తిగత జీవితాన్ని తనదైన శైలిలో బ్యాలెన్స్ చేస్తున్న ఈ టాప్ హీరోయిన్ ప్రయాణం సామాజిక నిబంధనలకు భిన్నంగా సాగుతుండటం విశేషం.