ఇప్పుడు మాత్రం హీరోల‌కు -హీరోయిన్లు డాట‌ర్లు అవ్వ‌రే!

త‌మ‌న్నా వ‌య‌సెంత 33..చిరంజీవి వ‌య‌సెంత 67.. కాజ‌ల్ ఏజ్ ఎంత 38..బాల‌య్య వ‌య‌సెంత 63. ఇక వెంకంటేష్..నాగార్జున వ‌య‌సులు దాదాపు స‌మానం. ఇద్ద‌రికి 63 ఉండొచ్చు. వాళ్ల స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ల‌కు 30-35 మ‌ధ్య‌లో ఉండొచ్చు;

Update: 2023-07-23 13:12 GMT

త‌మ‌న్నా వ‌య‌సెంత 33..చిరంజీవి వ‌య‌సెంత 67.. కాజ‌ల్ ఏజ్ ఎంత 38..బాల‌య్య వ‌య‌సెంత 63. ఇక వెంకంటేష్..నాగార్జున వ‌య‌సులు దాదాపు స‌మానం. ఇద్ద‌రికి 63 ఉండొచ్చు. వాళ్ల స‌ర‌స‌న న‌టించే హీరోయిన్ల‌కు 30-35 మ‌ధ్య‌లో ఉండొచ్చు. అంత‌క‌న్నా త‌క్కువే ఉండొచ్చు. మ‌రి ఇప్పుడీ హీరోయిన్లు అంతా ఆ హీరోల‌కు కుమార్తెలు అవ్వ‌రా? వాళ్లంతా తండ్రి వ‌య‌సున్న హీరోలు కాదా? అంటే కాదనే అంటాయి కొన్ని స‌మీక‌ర‌ణాలు. ప్ర‌స్తుతం త‌మ‌న్నా చిరంజీవి స‌ర‌స‌న `భోళా శంక‌ర్` లో న‌టిస్తోంది.

కాజల్ అగ‌ర్వాల్ లో బాల‌య్య‌తో `భ‌గ‌వంత్ కేస‌రి` చేస్తోంది. ఇప్పుడా హీరోయిన్ల స్థానంలో ఓ కొత్త భామ‌ని ఎంపిక చేస్తే మాత్రం నెగిటివిటీ మామూలుగా ఉండ‌దు. కుమార్తె వ‌య‌సున్న హీరోతో? 60 ఏళ్ల హీరో ఏంట‌ని విమ‌ర్శ‌లు వెల్లు వెత్తుతుంటాయి. ర‌వితేజ `ధ‌మాకా`లో అప్పుడే ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల‌ని ఎంపిక చేస్తే ఇలాంటి విమ‌ర్శ‌లే ఎదుర్కోవాల్సి వ‌చ్చింది ఆ హీరో. కుమార్తె వ‌య‌సున్న అమ్మాయితో ర‌వితేజ రొమాన్స్ ఏంటి? అని విమ‌ర్శించారు. కానీ ఇప్పుడు త‌మ‌న్నా..కాజ‌ల్ విష‌యంలో ఆ విమ‌ర్శ‌లు అట‌కెక్కాయి.

అందుకు కొన్ని కార‌ణాలున్నాయి. ఇద్ద‌రు సీనియ‌ర్ భామ‌లు. ఇండ‌స్ట్రీలో 10 ఏళ్ల‌కు పైగా అనుభ‌వం ఉంది. హీరోలందిరితోనూ ప‌నిచేసారు. ఆ లెక్క‌లే ఈ భామ‌ల్ని కుమార్తె అన్న ట్యాగ్ నుంచి దూరం చేసాయి. చిరుతో త‌మ‌న్నా గ‌తంలో `సైరా న‌ర‌సింహారెడ్డి`లో న‌టించింది. త‌మ‌న్నా కంటే ముందుగానే కాజ‌ల్ అగ‌ర్వాల్ చిరు తో `ఖైదీ నెంబ‌ర్ 150`లో రొమాన్స్ చేసింది. ఇంకా వెంక‌టేష్..నాగార్జున లాంటి స్టార్స్ తోనూ ఆ భామ‌లు ప‌నిచేసారు. దీంతో ఆడియ‌న్స్ మైండ్ లో ఆ భామ‌లంతా సీనియ‌ర్లు అనే ముద్ర బ‌లంగా ప‌డిపోయింది.

ఇప్పుడీ కాంబినేష‌న్స్ ప్రేక్ష‌కులు సునాయాసంగా జీర్ణించుకుంటున్నారు. త‌మ‌న్నా..కాజ‌ల్ ఏ హీరోతో న‌టించినా అంగీక‌రామే. శ్రీలీల కూడా మ‌రో నాలుగైదు సినిమాలు చేసి చిరు..బాల‌య్య‌.. వెంకీ..నాగ్ ల‌తో రొమాన్స్ చేసినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. `ధ‌మాకా` సినిమాకొచ్చినంత నెగివిటీ అప్ప‌టికీ రాదు. అందుకే స‌క్సెస్ అయిన భామ‌ల కెరీర్ కి లాంగ్ ర‌న్ కూడా ఉంటుందన్న‌ది వాస్త‌వం.

Tags:    

Similar News