కంబ్యాక్ ఎన్ఐఆర్ ఐ ల బ్యాకప్ తోనా?
నటుడిగా ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా వెలిగిన ఓ ప్రముఖ వ్యక్తి ఎవరు? అన్నది తెలిసిందే. నిర్మించింది ఎనిమిది సినిమాలే అయినా? అందులో నటించిన వారంతా బిగ్ స్టార్స్.;
నటుడిగా ఎంట్రీ ఇచ్చి నిర్మాతగా వెలిగిన ఓ ప్రముఖ వ్యక్తి ఎవరు? అన్నది తెలిసిందే. నిర్మించింది ఎనిమిది సినిమాలే అయినా? అందులో నటించిన వారంతా బిగ్ స్టార్స్. కోట్లాది రూపాయలు పారితోషికం చెల్లించి..కోట్ల రూపాయలు నిర్మాణానికి ఖర్చు చేసి భారీ ఎత్తున ఆ సినిమాలు రిలీజ్ చేసాడు. దీంతో అగ్ర నిర్మాతల సరసన అనతి కాలంలోనే స్థానం సంపాదించాడు. కానీ ఆ స్థానాన్ని ఎంతో కాలం కొనసాగించలేకపోయాడు. విజయాలు ఆయనకు మూడు నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయాయి. వైఫల్యాలు సహా రకరకాల పరిస్థితులు అతడిని రేసులో వెనక్కి నెట్టాయి.
సెకెండ్ ఇన్నింగ్స్ షురూ:
నిర్మాణంతో పాటు రాజకీయాల్లో కాలు పెట్టడంతో? కొన్ని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో సినిమాలకు గ్యాప్ ఏర్పడింది. దాదాపు పదేళ్ల గా సినిమా నిర్మాణానికి దూరంగా ఉంటున్నాడు. అయితే రెండు..మూడేళ్లగా ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ యాక్టివ్ గా తిరుగుతున్నాడు. రెగ్యులర్ గా హీరోలందరికీ టచ్ లో ఉంటున్నాడు. పార్టీలకు అంటెండ్ అవుతున్నాడు. తాను కూడా స్వయంగా లక్షల రూపాయలు ఖర్చు చేసి హీరోలకు స్పెషల్ పార్టీలు కూడా ఇస్తున్నాడు. వీటితోనే సదరు నిర్మాత సెకెండ్ ఇన్నింగ్స్ షురూ అవుతుందని ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది.
పాన్ ఇండియా సినిమాలే:
త్వరలోనే మళ్లీ నిర్మాతగా రీఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు రావడంతో పాటు వాటిని ఆయన కూడా ధృవీకరించాడు. అయితే ఈసారి స్ట్రాంగ్ బ్యాక్ తోనే రంగంలోకి దిగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొంత మంది ఎన్ ఐ ఆర్ ఐల భాగస్వామ్యంతో కొత్తగా నిర్మాణ సంస్థను స్థాపించాలని పావులు కదుపుతున్నాడుట. పెట్టుబడి ఎంతైనా తాము పెడతామని కానీ సంస్థని మాత్రం సమర్దవంతంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత అంతా అతడిపైనే పెట్టినట్లు సమాచారం. తదుపరి చేసే సినిమాలు కూడా భారీ బడ్జెట్ చిత్రాలు మాత్రమే అవ్వాలని సదరు నిర్మాత సహా ఎన్ ఆర్ ఐలు భావిస్తున్నారుట.
కొత్త పేరుతో బ్యానర్:
ప్రస్తుత ట్రెండ్ ని ఫాలో అవుతూ పాన్ ఇండియా కంటెంట్ సినిమాలు మాత్రమే చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారుట. ఓవర్సీస్ మార్కెట్ లో ఆ కంటెంట్ తమకు ఇతర రూపాల్లో కూడా కలిసి రావాలని ..ఆరకంగా సదరు నిర్మాత ప్లానింగ్ ఉండాలని ఆదేశించారుట. అలాగే పాత బ్యానర్ తో కాకుండా ఇకపై ఏ సినిమా నిర్మించిన కొత్త బ్యానర్ తోనే సినిమా మార్కెట్లో ఉండాలని అందుకు తగ్గట్టు బ్యానర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారుట. గతంలో సదరు నిర్మాత కొంత మంది రాజకీయ నాయకుల అండతోనే బ్యానర్ స్థాపించినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎన్ ఐ ఆర్ ఐలు అండతో మళ్లీ తెరపైకి వస్తున్నట్లు కనిపిస్తుంది. టాలీవుడ్ లో చాలా బ్యానర్ల వెనుక ఉన్నది ఎన్ ఆర్ ఐల పెట్టుబడులు అన్న సంగతి తెలిసిందే.