సూపర్ స్టార్ 'కింగ్'తో కుర్రహీరో దశ తిరిగేనా..!
బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త వారు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం.;
బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కొత్త వారు వస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీకి చెందిన ఫ్యామిలీ నుంచి ఎక్కువ మంది ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. బాలీవుడ్‌లో పెద్దగా బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎదగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఇప్పుడు అభయ్ వర్మ గురించి బాలీవుడ్‌లో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ వారసుడు కాదు, దర్శక నిర్మాతల ఫ్యామిలీలతో సంబంధం లేదు. అయినా కూడా ఇండస్ట్రీలో ఛాన్స్‌లు దక్కించుకుని మెల్ల మెల్లగా హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ రెండో సీజన్‌లో ముఖ్యమైన చిన్న పాత్రలో నటించిన అభయ్ వర్మ నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. దాంతో అభయ్‌కి వరుస ఆఫర్లు తలుపు తడుతున్నాయి.
షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌కి జోడీగా..
వెబ్ సిరీస్‌లో చేసిన నటనకు గాను హీరో ఆఫర్లు వస్తున్నాయి. హీరోగా సినిమా చేసే అవకాశాలు వస్తున్న ఈ సమయంలో అభయ్ వర్మ ఏకంగా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ మూవీ 'కింగ్' లో ముఖ్య పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నాడు. సినిమాలో ఒక లవ్ ట్రాక్ ఉంటుందని, అది అభయ్ వర్మ పై ఉంటుందని సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ సైతం 'కింగ్' సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. బాలీవుడ్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం కింగ్ సినిమాలోని లవ్ ట్రాక్ అభయ్ వర్మ, సుహానా ఖాన్ పై ఉంటుందని, ఇద్దరి కాంబోలో రొమాంటిక్ లవ్ సీన్స్‌ని చిత్రీకరిస్తున్నట్లు సైతం సమాచారం అందుతోంది. ఈ సినిమాపై అభయ్ వర్మ చాలా ఆశలు పెట్టుకున్నట్లు ఆయన సన్నిహితులు, బాలీవుడ్ వర్గాల వారు చెబుతున్నారు.
'కింగ్' సినిమా కీలక పాత్రలో అభయ్ వర్మ
అభయ్ వర్మ ఈ మధ్య కాలంలో సఫేద్ అనే సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఆ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. గత ఏడాది ఈయన నటించిన కామెడీ హర్రర్ మూవీ ముంజ్య తో మరింత ముందుకు దూసుకు వెళ్లే అవకాశం దక్కించుకున్నాడు. కింగ్ సినిమా కారణంగా కొత్తగా సినిమాలకు అభయ్ వర్మ కమిట్ కావడం లేదు. వచ్చే ఏడాది నుంచి కొత్త సినిమాలు, అది కూడా హీరోగా మాత్రమే సినిమాలను చేస్తాను అంటూ అభయ్ వర్మ సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం అందుతోంది. షారుఖ్ ఖాన్ వంటి సూపర్ స్టార్ సినిమాలో చిన్న పాత్ర దక్కినా ఖచ్చితంగా కెరీర్‌కి అది మంచి బూస్ట్‌గా పని చేస్తుంది. కనుక కింగ్ సినిమా తర్వాత అభయ్ వర్మ సినిమా ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదని, తప్పకుండా బిజీ బిజీగా స్టార్ గా అవకాశాలు వస్తాయనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్‌లో న్యూ జెనరేషన్ హీరో
కింగ్ సినిమాతో ఈ కుర్ర హీరో దశ తిరగడం ఖాయం అంటూ చాలా మంది విశ్లేషకులు చెబుతున్నారు. షారుఖ్ ఖాన్ కూతురుతో అభయ్ వర్మకు లవ్ సీన్స్, రొమాంటిక్ సీన్స్ ఉంటే ఖచ్చితంగా జనాల్లో నోటెడ్ అవుతాడు. తద్వారా సినిమాల్లో ఎక్కువగా ఆఫర్లు దక్కించుకుంటాడు. ఇండస్ట్రీలో కొత్త హీరోలు పరిచయం కావడం కామన్ విషయం, కానీ వారు నిలదొక్కుకోవడం కష్టంగా ఉంది. ఇప్పుడు అభయ్ ని చూస్తూ ఉంటే ఇండస్ట్రీలో అతడు నిలదొక్కుకున్నట్లే అనే అభిప్రాయంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. హర్యానాలోని పానిపట్‌లో జన్మించిన అభయ్ వర్మ స్థానక స్కూల్‌లో చదివాడు.
బీబీఏ లో చేరిన అతడు టైం వేస్ట్ అని గ్రహించి ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. అంతకు ముందే అభయ్ వర్మ సోదరుడు అభిషేక్ వర్మ నటుడిగా కొనసాగుతున్నాడు. సూపర్ 30 సినిమాలో సెట్ లో జూనియర్ ఆర్టిస్టుగా రోజుకు రూ.800 లు తీసుకున్నాడు. ఇప్పుడు అతడు సినిమాకు కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.