బర్నింగ్ స్టార్ బ్యూటీ అలియాభట్ లా ఫేమస్!
ఇండస్ట్రీకి ఎన్నెన్నో కలలు..ఆశయాలతో వస్తారు. కానీ వాళ్లలో సక్సెస్ అయ్యేది అతి కొద్ది మందే.;
ఇండస్ట్రీకి ఎన్నెన్నో కలలు..ఆశయాలతో వస్తారు. కానీ వాళ్లలో సక్సెస్ అయ్యేది అతి కొద్ది మందే. ప్రతిభతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా కలిసొస్తేనే ఇక్కడ సక్సెస్ అయ్యేది. అందులో హీరోయిన్ల విష యంలో కాంపిటీషన్ పీక్స్ లో ఉంటుందని చెప్పాల్సిన పనిలేదు. కొత్త నీరు వచ్చే కొద్ది పాత నీరు పోతుంది . సక్సెస్ అయిన కొత్త వాళ్లంతా సీనియర్ భామలతో మమేకమై కలిసి పనిచేస్తూ ముందుకెళ్తుంటారు.
టైర్ 3 భామల విషయానికి వస్తే వీళ్లలో సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. నాలుగైదు సినిమాలు చేసి వెళ్లిపోవడం తప్ప స్థిరంగా పనిచేయడం అన్నది అందరికీ సాధ్యం కాదు. తాజాగా ఆర్తీ గుప్తా అనే మరో కొత్త భామ ఎంట్రీ ఇచ్చింది. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన `సోదరా` సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాలపై ఆర్తి గుప్తా చాలా కాన్పిడెంట్ గా ఉంది. హిట్ అందుకుని బిజీ నాయికగా మారుతాననే ధీమా వ్యక్తం చేసింది.
ఓసారి ఈ భామ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తే అమ్మడిది చండీఘడ్. ప్రస్తుతం ముంబైలో స్థిరపడింది. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా చేసిందిట. ఆ అనుభవంతోనే టాలీవుడ్ కి వచ్చినట్లు తెలిపింది. తెలుగు సినిమాల్లో స్థిరపడాలి? అన్న ఆలోచనతో ఉన్నట్లు వెల్లడించింది. అన్ని తరహా సినిమాలు చేయాలం టోంది. బాలీవుడ్ లో అలియాభట్ నటన అంటే ఇష్ట అంటోంది. ఆమెలా శక్తివంతమైన పాత్రలు పోషిం చాలని ఉందని తెలిపింది.
అలాగే టాలీవుడ్ లో అల్లు అర్జున్ అంటే ఇష్టమని తెలిపింది. ఆర్తి గుప్తాకి ఇదే తొలి సినిమా. మరి ఇందులో అమ్మడి పెర్పార్మెన్స్ ఎలా ఉంటుందో చూడాలి. ప్రతిభావంతుల్ని ప్రోత్సహించడంలో టాలీవుడ్ ఎప్పుడు ముందుంటుంది. అందులోనూ పరభాషా హీరోయిన్లు ఎంకరేజ్ చేయడంలో మరింత ఉత్సాహంతో ఉంటుంది. మరి టాలీవుడ్ టప్ కాంపిటీషన్ నడుమ ముంబై బ్యూటీ ఎలాంటి ఛాన్సులం దుకుంటుందో చూడాలి.