లోకేష్ ఆ మూవీ సంగతేంటి? లేనట్లేనా?
భవిష్యత్‌లో అమీర్ ఖాన్ తో కచ్చితంగా ఓ సినిమా ఉంటుందని చెప్పిన ఆయన.. భారీ యాక్షన్ జోనర్ లో రూపొందించనున్నట్లు తెలిపారు.;
బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ర్ అమీర్ ఖాన్, కోలీవుడ్ స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కలిసి ఓ సినిమా చేయనున్నారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ వార్తలపై అటు అమీర్ ఖాన్.. ఇటు లోకేష్ కనగరాజ్ క్లారిటీ ఇచ్చారు. ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు కోసం లోకేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ కూడా చేశారు.
భవిష్యత్‌లో అమీర్ ఖాన్ తో కచ్చితంగా ఓ సినిమా ఉంటుందని చెప్పిన ఆయన.. భారీ యాక్షన్ జోనర్ లో రూపొందించనున్నట్లు తెలిపారు. సూపర్ హీరో మూవీ కాదని క్లారిటీ ఇచ్చారు. 2026 చివర్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు వెల్లడించారు. కార్తీ హీరోగా రానున్న ఖైదీ-2 తర్వాత అమీర్ మూవీ చేస్తానని తెలిపారు.
కానీ ఖైదీ-2 కన్నా ముందు కోలీవుడ్ దిగ్గజాలు రజనీ కాంత్, కమల్ హాసన్ తో మల్టీస్టారర్ చేయనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ మధ్య లోకేష్ కనగరాజ్ పరోక్షంగా కూడా చెప్పారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో మరో వార్త వైరల్ గా మారింది. అమీర్ ఖాన్- లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టు పూర్తిగా నిలిచిపోయినట్లు టాక్ వినిపిస్తోంది.
భవిష్యత్తులో ఆ సినిమా ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే ఓ వైపు కమల్, రజినీలతో మూవీ చేయాలనుకుంటున్న లోకేష్.. మరోవైపు హీరోగా తెరంగేట్రానికి సిద్ధమవుతున్నారు. కాబట్టి ఇప్పటి బిజీ షెడ్యూల్ లో ఆ సినిమా రూపొందదని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతో తెలియకపోయినా ప్రచారం మాత్రం జరుగుతోంది.
అయితే కూలీ మూవీ ప్రమోషన్ల టైమ్ లో అమీర్ మూవీపై మాట్లాడిన లోకేష్.. ఆ తర్వాత ఆ ఊసే ఎత్తలేదు. అదే సమయంలో ఒకవేళ నిజంగా అమీర్ తో సినిమా ఉంటే.. వెంటనే రెస్పాండ్ అయ్యి క్లారిటీ ఇవ్వాలి. ఏదైనా అప్డేట్ కూడా ఇస్తే బాగుంటుంది. అప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఊహాగానాలకు చెక్ పడే ఛాన్స్ ఉంది.
కాగా.. లోకేష్ కనగరాజ్ ఇటీవల కూలీ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ వసూళ్లు రాబట్టిన ఆ సినిమా.. అనుకున్నంత స్థాయిలో రెస్పాన్స్ మాత్రం అనుకోలేదు. ఆ సినిమాలో అమీర్ ఖాన్.. కీలక పాత్ర పోషించారు. కానీ సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం వల్ల విమర్శలు ఎదుర్కొన్నారు. ఏదేమైనా లోకేష్- అమీర్ మూవీ ఉంటుందో లేదో వేచి చూడాలి.