సెన్సార్ వాళ్ల‌ను ప‌డ‌గొట్టిన మొన‌గాడు ఈ హీరో

అప్ప‌టిక‌ప్పుడు ఏమైందో కానీ, `సీతారే జమీన్ పర్` ఇక రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటూ ప్ర‌చార‌మైంది.;

Update: 2025-06-17 06:52 GMT
సెన్సార్ వాళ్ల‌ను ప‌డ‌గొట్టిన మొన‌గాడు ఈ హీరో

అప్ప‌టిక‌ప్పుడు ఏమైందో కానీ, 'సీతారే జమీన్ పర్' ఇక రిలీజ్ కావ‌డం క‌ష్ట‌మే అంటూ ప్ర‌చార‌మైంది. మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ఎంతో మ‌న‌సు పెట్టి రూపొందించిన ఈ సీక్వెల్ సినిమా విడుద‌ల‌కు సెన్సార్ మోకాల‌డ్డింద‌ని, రెండు అభ్యంత‌ర‌క‌ర సీన్ల‌ను తొల‌గించాల‌ని అమీర్ ని ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.ప్ర‌స‌న్న‌ల‌ను కోరితే దానికి వారు నిరాక‌రించార‌ని ప్ర‌చారం సాగింది.

సినిమాలో న‌టించిన హీరో కం నిర్మాత‌, ద‌ర్శ‌కుడు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో ఇక సెన్సార్ పూర్త‌వ్వ‌ని సినిమా రిలీజ్ కావ‌డం కూడా క‌ష్ట‌మేన‌ని ప్ర‌చారం సాగింది. కానీ ఇంత‌లోనే అనూహ్యం... అమీర్ ఖాన్ సెన్సార్ ప్ర‌తినిధుల్ని ఒప్పించేందుకు కంక‌ణం క‌ట్టుకున్నాడ‌ని, ఆ రెండు సీన్లు తొల‌గించ‌కుండా త‌న ప్ర‌య‌త్నాలు తాను చేసాడ‌ని క‌థ‌నాలొచ్చాయి. అయితే అమీర్ ముందు సెన్సార్ ప్ర‌తినిధులే త‌లొంచారా లేక సెన్సార్ క‌ట్స్ కి ఒప్పుకుని చివ‌రికి అమీర్ సినిమాని రిలీజ్ చేయిస్తున్నారా? అన్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు. అయితే సినిమా మాత్రం స‌జావుగా ఈనెల 20న రిలీజైపోతోంది. వ‌రుస వాయిదాల త‌ర్వాత ఈ సినిమాకి సెన్సార్ నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చేసింది.

ఆమిర్ ఖాన్, జెనీలియా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమాకి శంకర్-ఎహ్సాన్-లాయ్ సంగీతం అందించారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. తాజాగా ముంబైలో ప్రీమియ‌ర్ కూడా వేసారు. ఈ ప్రీమియ‌ర్ లో అమీర్ తో పాటు అత‌డి స్నేహితురాలు గౌరీ స్ప్రాట్ కూడా క‌నిపించింది. అలాగే అమీర్ అక్క నిఖత్ ఖాన్ హెగ్డే కూడా హాజరయ్యారు. ఈ ముగ్గురూ ఒకే కారులో వచ్చారు. అమీర్ -గౌరీ ఒకరి పక్కన ఒకరు కూర్చున్నారు. ఈ జంట‌ బహిరంగ ప్రదర్శన సాయంత్రం హైలైట్ ల‌లో ఒక‌టి. అమీర్ తో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన జెనీలియా డిసౌజా దేశ్ ముఖ్ కూడా ప్రీవ్యూ వ‌ద్ద‌ కనిపించారు.

సీతారే జ‌మీన్ ప‌ర్ కోసం సరైన ఆర్టిస్టుల‌ను కనుగొనడానికి చిత్ర‌బృందం దాదాపు 10 నెలల్లో 2,500 మందికి పైగా వ్యక్తులను ఆడిషన్ చేసిందని ద‌ర్శ‌కుడు ఆర్.ఎస్.ప్ర‌స‌న్న‌ వెల్లడించారు. ప్రొఫెషనల్ నటులను కోరుకోలేద‌ని, రాగా ఉండే నిజమైన ప్రతిభ కోసం వెతక‌డం స‌వాల్ గా మారిందని తెలిపారు. చాలా ఆడిషన్‌లు ఆన్‌లైన్‌లో జరిగాయని, మొదటిసారి కెమెరా ముందు సౌకర్యవంతంగా ఉండటానికి వరుస సన్నాహక వర్క్‌షాప్‌లను నిర్వహించాల్సి వచ్చిందని ఆయన అన్నారు.

Tags:    

Similar News

RFCలో మెగా 157..!