స్టార్ హీరోపై తమ్ముడు సంచలన ఆరోపణ!
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పై ఆయన సోదరుడు పైసల్ ఖాన్ కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలతో అన్నాదమ్ములు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే.;
బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ పై ఆయన సోదరుడు పైసల్ ఖాన్ కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలతో అన్నాదమ్ములు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పైసల్ ఖాన్ ఆరోపణ చేయడం వాటిని అమీర్ ఖాన్ ఖండించడం పరిపాటిగా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా పైసల్ ఖాన్ మరో ఆరపణతో తెరపైకి వచ్చాడు. 1990 నాటి సంగతని తెరపైకి తెచ్చి అమీర్ ని హాట్ టాపిక్ గా మార్చాడు. బ్రిటన్ జర్నలిస్ట్ జెస్సి కా హైన్స్ తో అమీర్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని ఆరోపించాడు.
వాళ్లిద్దరికీ ఓ బిడ్డ కూడా జన్మించిందని షాక్ ఇచ్చాడు. మొదటి భార్య రీనా దత్తా తో సంబంధాలున్న సమయంలో జెస్సీకాతోనూ రిలేషన్ షిప్ కొనసాగించినట్లు పేర్కొన్నాడు. రీనాతో విడాకుల అనంతరం జెస్సీకాతోనే ఎక్కువగా ఉన్నట్లు తెలిపాడు. చివరికి రెండవ భార్య కిరణ్ రావుతో ఉన్నప్పుడు కూడా జెస్సీకాతో యధా విధిగా రిలేషన్ కొనసాగించినట్లు ఆరోపించాడు. జెస్సీకాతో అమీర్ రిలేషన్ షిప్ పై గతంలోనే మీడియాలో కథనాలొచ్చాయి. వారిద్దరికీ పుట్టిన బిడ్డ పేరు జాన్ అని ప్రచారం జరిగింది.
అయితే ఈ ప్రచారంపై ఎన్నడూ అమీర్ ఖాన్ స్పందించలేదు. జెస్సీకా కూడా వీటిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. మరి సోదరుడి తాజా ఆరోపణలపై అమీర్ ఖాన్ ఎలా స్పందిస్తారో చూడాలి. `మేళా` సినిమా లో అమీర్ ఖాన్-పైసల్ ఖాన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి పని చేయలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తినట్లు ప్రచారంలో ఉంది.
అప్పటి నుంచి ఇరువురు వేరుగా ఉంటున్నారని కుటుంబంతో పైసల్ ఖాన్ కి ఎలాంటి సంబంధాలు లేవని , అమీర్ ఖాన్ ఇంట్లోనే తమ్ముడిని బంధీగా చేసి ఉంచారని ఆరోపించాడు పైసల్ ఖాన్. తనకి మానసిక సమస్యలున్నాయని కుటుంబ సభ్యులే తనపై కక్ష గట్టి వ్యవరహించారన్నాడు. సమాజం తనని ఓ పిచ్చివాడిలా జమకట్టేలా కుటుంబమే కుతంత్రాలు చేసినట్లు ఆరోపించిన సంగతి తెలిసిందే.