• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అంతా మర్చిపోయే టైమ్‌ కి...

అంతా మర్చిపోయే టైమ్‌ కి రాబోతున్న హిట్‌ బొమ్మ!

| మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' వంద కోట్లకు పైగా వసూళ్లు సాదించిన విషయం తెల్సిందే

By - Tupaki Desk
Update: 2024-07-14 08:48 GMT

మలయాళ విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన 'ఆడుజీవితం' వంద కోట్లకు పైగా వసూళ్లు సాదించిన విషయం తెల్సిందే. ఇతర భాషల్లో ది గోట్ లైఫ్ గా విడుదల అయిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా భారీ వసూళ్లు సాధించడం ద్వారా ఈ ఏడాది మేటి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

థియేట్రికల్‌ రిలీజ్ సమయంలో చూడలేని వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఓటీటీ స్ట్రీమింగ్‌ కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది.

బిజినెస్ ఇష్యూ కారణంగా విడుదల అయిన నాలుగు నెలల తర్వాత విడుదల అవ్వబోతుంది. ఈ మధ్య కాలంలో సినిమాలు అన్నీ కూడా విడుదల అయిన మూడు నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కానీ నాలుగు నెలల తర్వాత ఆడుజీవితం మళ్లీ రాబోతుంది.

థియేట్రికల్‌ రిలీజ్ అయిన సమయంలో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై విపరీతమైన బజ్ క్రియేట్‌ అయ్యింది. అదే సమయంలో ఓటీటీ స్ట్రీమింగ్‌ చేసి ఉంటే కచ్చితంగా పాన్‌ ఇండియా స్థాయిలో రెండు మూడు వారాల పాటు ట్రెండ్‌ లో ఉండేది. ఇప్పుడు సినిమా గురించి జనాలు మాట్లాడుకోవడం లేదు.

ఈ సమయంలో సినిమా ను ఓటీటీ లో స్ట్రీమింగ్‌ చేస్తే మళ్లీ బజ్‌ క్రియేట్‌ అయ్యేనా, ఆ సమయంలో చూడాలి అనుకున్న వారు అంతా కూడా ఇప్పుడు ఓటీటీ లోకి వచ్చి చూస్తారా అనే అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

సలార్‌ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్‌ నటించిన ఈ సినిమా ఓటీటీ లో కూడా కచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ మలయాళ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. నెట్ ఫ్లిక్ వారు ఈ సినిమాను జులై 19న అంటే ఈ వారంలోనే స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

Tags:    
  • Aadujeevitham 
  • Thegoatlife 
  • Arrahman 
  • Prithvirajsukumaran 
  • Amalapaul 
  • Blessy 
  • Aadujeevithamott 
  • Netflix 

Similar News

మమిత బైజు అసలు పేరు ఆ హీరోయిన్ పేరా..మరి ఎలా మారిపోయింది?

2026-11-02 14:30 GMT

ఎథ్నిక్ లుక్‌లో ఆలియా భట్ గ్రాండ్ అప్పీల్.. లుక్ అదిరిపోయిందిగా!

2026-11-02 14:30 GMT

సూర్య ల్యాండ్ మార్క్..అది పాన్ ఇండియా మాత్ర‌మే!

2026-11-02 13:59 GMT

ఫోటో స్టోరి: బెబో స్ట్రైక్స్ ఎగైన్.. రీప్లేస్‌మెంటే లేని అందం!

2026-11-02 13:52 GMT

కాంబినేష‌న్ విడిపోవ‌డం విచార‌క‌ర‌మే!

2026-11-02 13:51 GMT

హీరోలే విల‌న్లు ఇంకెన్ని మార్పులో!

2026-11-02 13:30 GMT

పాలిటిక్స్‌లోకి రావాలంటే ‘ది ట్రైటర్స్’ చూస్తే చాలు.. శ్రీదేవి చౌదరి కామెంట్స్ వైరల్!

2026-11-02 12:30 GMT

రజినీకాంత్ తో భారీ సక్సెస్ కొట్టలేకపోయిన ఈ తరం స్టార్ డైరెక్టర్లు...

2026-11-02 11:30 GMT

రామాయణంపై అనవసరమైన సెటైర్లు ఎందుకు?

2026-11-02 11:02 GMT

అందరినీ మెప్పించలంటే.. ఐస్‌క్రీమ్ అమ్ముకోవాలా..!

2026-11-02 10:00 GMT

వెండితెర నుంచి రగ్బీ మైదానం వరకు!

2026-11-02 10:00 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

Copyright @2026

Powered by Blink CMS