గీతా మాధురితో కలర్ఫుల్ శంబాల..
ఇప్పుడు ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న 'శంబాల' సినిమా కోసం ఆమె పాడిన 'నా పేరు శంబాల' పాట సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది.;
చాలా కాలం తర్వాత సింగర్ గీతా మాధురి తన వాయిస్ తో మ్యాజిక్ చేశారు. ఒక మాస్ బీట్ పడితే ఆమె గొంతులో వచ్చే ఎనర్జీ వేరే లెవెల్ లో ఉంటుంది. ఇప్పుడు ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న 'శంబాల' సినిమా కోసం ఆమె పాడిన 'నా పేరు శంబాల' పాట సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. కిట్టు విస్సాప్రగడ రాసిన లిరిక్స్, శ్రీ చరణ్ పాకాల అందించిన ట్యూన్ కు గీతా మాధురి వాయిస్ తోడవ్వడంతో ఈ పాట ఇన్ స్టాంట్ గా జనాలకు ఎక్కేసింది.
ఈ సినిమా కేవలం ఒక రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదని, ఇదొక సూపర్ నేచురల్ థ్రిల్లర్ అని మేకర్స్ మొదట్నుంచీ చెబుతున్నారు. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. వీడియోలో గీతా మాధురి కనిపించిన విధానం, ఆ వెనక సెటప్, విజువల్స్ చూస్తుంటే సినిమా కాన్సెప్ట్ చాలా గ్రాండ్ గా ఉండబోతోందని స్పష్టంగా అర్థమవుతోంది. ఆడియెన్స్ ను థియేటర్ కు రప్పించడానికి కావాల్సిన కంటెంట్ ఇందులో గట్టిగానే ఉంది.
మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలకే రిలీజ్ టైమ్ కు బిజినెస్ డీల్స్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు. కానీ 'శంబాల' సినిమా మాత్రం విడుదలకు ఇంకా సమయం ఉండగానే, బిజినెస్ మొత్తం పూర్తి చేసుకుని ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. థియేటర్లో బొమ్మ పడకముందే మేకర్స్ కు టేబుల్ ప్రాఫిట్ వచ్చేసిందట. ఆది సాయికుమార్ మార్కెట్ పరంగా చూస్తే ఇది నిజంగా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి.
దీనికి ప్రధాన కారణం సినిమా కంటెంట్ మీద ఉన్న నమ్మకమే. ఆ నమ్మకంతోనే ప్రముఖ ఓటీటీ సంస్థ 'ఆహా' డిజిటల్ రైట్స్ కోసం పోటీ పడి మరీ సొంతం చేసుకుంది. అలాగే శాటిలైట్ హక్కులను 'జీ నెట్ వర్క్' ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. సాధారణంగా మీడియం రేంజ్ సినిమాలకు ఈ స్థాయి డిమాండ్ ఉండదు. కానీ పోస్టర్స్, టీజర్స్ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ వల్ల ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగిపోయింది.
షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. దర్శకుడు యుగంధర్ ముని విజన్ కు తగ్గట్టుగా భారీ బడ్జెట్ పెట్టినట్లు స్క్రీన్ మీద కనిపిస్తోంది. అర్చన అయ్యర్, స్వసిక లాంటి నటీనటులు, ప్రవీణ్ కె బంగారి విజువల్స్ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. కేవలం లాభాలే కాకుండా క్వాలిటీ విషయంలోనూ నిర్మాతలు గట్టిగా నిలబడ్డారు. గీతా మాధురి పాటతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచిన 'శంబాల' టీమ్, క్రిస్మస్ రేసులో గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ అవుతోంది. డిసెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా, ఆది కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అవుతుందని, అంచనాలకు మించి ఉంటుందని ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఈ మిస్టికల్ వరల్డ్ ఆడియెన్స్ ను ఎలా మెస్మరైజ్ చేస్తుందో.