ఆది శంబాల సీక్వెల్ కి సర్వం సిద్ధం.. హైలెట్ ఏంటంటే?
ఈ సీక్వెల్ కథాంశంతో పాటు నటీనటులు అలాగే విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఆది సాయికుమార్ చాలా రోజుల తర్వాత మరో మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అదే 'ఆది శంబాల'. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన మిస్టికల్ థ్రిల్లర్ తెలుగు చిత్రం ఇది. 1980 నాటి ఉల్కాపాతం తర్వాత ఒక మూఢనమ్మకాల గ్రామంలో జరిగిన వింత అతేంద్రియ సంఘటనలను పరిశోధించి, జానపద కథలతో శాస్త్రాన్ని మిళితం చేస్తూ అద్భుతంగా తెరపై చూపించారు దర్శకుడు యుగంధర్ ముని. అన్ని వర్గాల వారిని ఆకట్టుకున్న ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
గత ఏడాది డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో ఆది మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక తర్వాత ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. అలా గత రెండు రోజుల క్రితమే ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫారమ్ ఆహా వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి డిజిటల్ ఆదరణ భారీగా పెరిగిపోతోంది. వీక్షకుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో 'శంబాల2' పై క్లారిటీ ఇచ్చారు. నిజానికి ఈ సినిమా సీక్వెల్ గురించి ఎవరు ఆలోచించలేదు .కానీ ఎప్పుడైతే ఆహా డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చిన తర్వాత ప్రేక్షక ఆదరణ పెరిగిందో అప్పటి నుంచే శంభాల సీక్వెల్ కూడా తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు .
ఈ సీక్వెల్ కథాంశంతో పాటు నటీనటులు అలాగే విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. మొత్తానికైతే శంబాల ఫ్రాంచైజీలో భాగంగా సీక్వెల్ రావడంపై అంచనాలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్న భీమోజులు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించారు. ఇందులో ఆది సాయికుమార్ కీలక పాత్ర పోషించగా.. అర్చన అయ్యర్, శ్వాసిక, మధునందన్ కీలకపాత్రలు పోషించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచింది. త్వరలో సీక్వెల్ పై ప్రకటన వస్తుందని మేకర్స్ చెప్పడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు
ఆది శంబాల సినిమా స్టోరీ విషయానికి వస్తే.. 1980 దశకం నేపథ్యంలో సాగే కథ ఇది. 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక ఊరు శంబాల. అక్కడ ఆకాశం నుంచి ఒక ఉల్క పడుతుంది. అప్పటినుంచి ఊరిలో అనూహ్యమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. ఉన్నట్టుండి ఎవరో ఒకరు విచిత్రంగా ప్రవర్తిస్తూ హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. దాంతో భూతం ఆవహించిందంటూ ఊరి జనం భయంతో వనికిపోతూ ఉంటారు. మూఢనమ్మకాలు ఊరిని ఏలుతుంటాయి. ఆ రహస్యాలను ఛేదించేందుకే ప్రభుత్వం విక్రమ్ (ఆది) అనే ఒక యువ శాస్త్రవేత్తని ఆ గ్రామానికి పంపిస్తుంది. సైన్స్ నే నమ్ముకుని విధులు నిర్వర్తించే విక్రమ్ ఆ ఊర్లో జరుగుతున్న సంఘటనలు వెనుక రహస్యాన్ని చేదించాడా? లేదా? ఆ ఊరిలో కనిపించిన దేవి ఎవరు? విక్రమ్ నమ్ముకున్న సైన్స్ కి, ఊరి చరిత్ర వెనుక ఉన్న శాస్త్రానికి మధ్యన సంఘర్షణ ఎలా సాగింది ? అనే విషయాలు తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుంది. అందుకే ఇప్పుడు ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతోనే సీక్వెల్ ప్రకటించారు మేకర్స్.