మైత్రీ వారి '8 వసంతాలు'.. కుబేరకు పోటీగానే..

అయితే తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూన్ 20వ తేదీన థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు వెల్లడించారు.;

Update: 2025-05-29 17:21 GMT

టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. అటు భారీ చిత్రాలతోపాటు ఇటు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. అందులో ఒకటి 8 వసంతాలు చిత్రం. మ్యాడ్ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనంతిక సనీల్ కుమార్.. లీడ్ రోల్ పోషిస్తున్నారు.

 

లేడీ ఓరియెంటెడ్ జోనర్ లో రూపొందుతున్న ఆ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాపై ఆడియన్స్ లో పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. మేకర్స్ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన గ్లింప్సెస్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. మూవీ సోల్ ఫుల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని ప్రామిస్ చేశాయి.

ఓ అమ్మాయి తనకు ఉన్న బాధలు, వాటి నుంచి బయటకు వచ్చి మార్షల్ ఆర్ట్స్ లో ఎలా ఎదిగింది, అమ్మాయిలు వంటింటికి పరిమితం కాదని చెప్పే కాన్సెప్ట్ తో మూవీ రూపొందుతున్నట్లు క్లారిటీ ఇచ్చేశాయి. అయితే తాజాగా మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. జూన్ 20వ తేదీన థియేటర్లలో సినిమా రిలీజ్ అవ్వనున్నట్లు వెల్లడించారు.

జూన్‌ లో ప్రేమ సజీవంగా వస్తుంది.. పెద్ద స్క్రీన్‌ లపై ప్రేమ యొక్క ప్రతి కోణాన్ని జరుపుకోండి.. అంటూ పోస్ట్ పెట్టారు. దాంతోపాటు స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సినిమాలో శుద్ధి అయోధ్యగా కనిపించనున్న అనంతిక.. పోస్టర్ లో బ్యూటిఫుల్ గా కనిపించారు. క్రీమ్ కలర్ చీరలో ఆమె ప్లజెంట్ గా ఉండి సందడి చేశారు.

జుట్టులో గులాబీతో ఉన్న అనంతిక డీసెంట్ లుక్.. సినిమాలో ఆమె క్యారెక్టర్ నేచర్ ను క్లియర్ గా ప్రజెంట్ చేస్తుందని చెప్పాలి. పోస్టర్ చాలా కూల్ గా.. బాగుందని నెటిజన్లు ఇప్పుడు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి హృదయాన్ని కదిలించే ప్రేమ గాథ మరో మూడు వారాల్లో ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచబోతోందన్నమాట.

అదే సమయంలో జూన్ 20వ తేదీన కుబేర మూవీ రిలీజ్ అవుతుందని ఇప్పటికే ఆ సినిమా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ధనుష్, నాగార్జున నటిస్తున్న ఆ మూవీని శేఖర్ కమ్ముల తెరకెక్కించగా, ఆసియన్ సునీల్ నారంగ్ నిర్మించారు. అయితే ఆసియన్ సునీల్, దిల్ రాజు, సురేష్ బాబు ఒకటేనని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.

ముగ్గురూ కలిసి ఏదైనా పని చేస్తారని చెబుతుంటారు. ఇప్పుడు వారు ముగ్గురు కుబేర మూవీ వైపు ఉన్నారని సమాచారం. అదే సమయంలో ఆ సినిమా రిలీజ్ అయిన రోజే ఆపోజిట్ గా మైత్రీ మూవీ మేకర్స్.. 8 వసంతాలు సినిమాను రంగంలోకి దింపుతోంది. చిన్న మూవీ అయినా కంటెంట్ బాగుంటే ఓ రేంజ్ లో దూసుకుపోవడం పక్కా. మరేం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News