2025: వరల్డ్ వైడ్ తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు!

మరి ఈ ఏడాది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు ఏంటి? వాటిలో మీ హీరో చిత్రం కూడా ఉందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం..;

Update: 2025-12-15 10:30 GMT

2025 సంవత్సరం ముగింపుకు చేరుకుంది. మరికొన్ని రోజుల్లో ఈ ఏడాది పూర్తయి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకనున్నాము. ఈ సందర్భంగా ఈ ఏడాది సినిమా ఇండస్ట్రీలో జరిగిన కొన్ని విషయాలను అభిమానులు నెమరు వేసుకుంటున్నారు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది తొలి రోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు ఏంటి ? ఏ మూవీ ఎంత కలెక్షన్ రాబట్టింది? ఏ మూవీ మొదటి స్థానాన్ని దక్కించుకుంది? అనే విషయాలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. మరి ఈ ఏడాది మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా తొలిరోజు అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలు ఏంటి? వాటిలో మీ హీరో చిత్రం కూడా ఉందా? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

కూలీ:

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన చిత్రం కూలీ. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటిరోజు రూ. 151.90 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి.. తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా అత్యధిక గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా మొదటి స్థానాన్ని దక్కించుకుంది.

ఓజీ: దే కాల్ హిమ్ ఓజీ..

ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం ఓజీ. సెప్టెంబర్ లో విడుదలైన ఈ సినిమా మొదటి రోజు రూ.145 కోట్లు వసూలు చేసింది. 250 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫుల్ రన్ ముగిసే సరికి రూ.300 కోట్ల వరకు కలెక్షన్స్ వసూలు చేసింది.

గేమ్ ఛేంజర్:

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన చిత్రం ఇది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మొదటి రోజు సుమారుగా రూ.92.25 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. దీనికి తోడు ఆర్ఆర్ఆర్ తర్వాత చేసిన సినిమా కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేక డిజాస్టర్ గా నిలిచింది.

కాంతార చాప్టర్ 1:

రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన చిత్రం కాంతార చాప్టర్ వన్. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా.. గుల్షన్ దేవయ్య కీలక పాత్ర పోషించిన ఈ చిత్రం మొదటి రోజు రూ.87.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి నాలుగవ స్థానంలో నిలిచింది.

వార్ 2:

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం వార్ 2. అంతేకాదు ఎన్టీఆర్ నటించిన తొలి బాలీవుడ్ చిత్రం కూడా ఇదే కావడం గమనార్హం. దీంతో అటు హిందీలోనే కాదు ఇటు నార్త్ లో కూడా భారీగా అంచనాలు పెరిగిపోయాయి. అందుకు తగ్గట్టుగానే మొదటిరోజు భారీ ఓపెనింగ్స్ జరిగింది. రూ.86.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసి ఐదవ స్థానంలో నిలిచింది.

హరిహర వీరమల్లు:

ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం హరిహర వీరమల్లు. రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చేసిన తొలి చిత్రం కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి. అలా మొదటి రోజు రూ.70 కోట్లు కలెక్షన్స్ వసూలు చేసింది. అలాగే హరిహర వీరమల్లు 2 కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

ఎంపురాన్:

పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా వచ్చిన ఈ మలయాళ చిత్రం మొదటి రోజు రూ.67.35 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

డాకు మహారాజ్:

బాబీ కొల్లి దర్శకత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం డాకు మహారాజ్. ఈ సినిమా కూడా సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది విడుదలైంది. ఇక ఈ చిత్రం మొదటి రోజు రూ.51.85 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసింది.

ఇంకా ఈ చిత్రాలతో పాటు ఈ ఏడాది తొలిరోజే అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాల విషయానికి వస్తే..

అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ - రూ.51.50 కోట్లు

అఖండ 2 - రూ.48.85 కోట్లు

విదాముయార్చి - రూ.48.45 కోట్లు

ఛావా - రూ.47.55 కోట్లు రాబట్టింది.

Tags:    

Similar News