అల్లరి నరేష్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ ఎలా ఉందంటే?
ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. అందరిలో సినిమాపై ఉత్కంఠను పెంచుతుందనే చెప్పాలి.;
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఎప్పుడూ కడుపుబ్బా నవ్వించే హీరో అల్లరి నరేష్.. ఇప్పుడు థ్రిల్ చేసేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఆయన లీడ్ రోల్ లో నాని కాసరగడ్డ 12ఏ రైల్వే కాలనీ మూవీని థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. అందులో పొలిమేర ఫేమ్ డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్నారు.
పొలిమేర, పొలిమేర 2 సినిమాలకు పనిచేసి అందరినీ మెప్పించిన రైటర్ కమ్ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్.. 12ఏ రైల్వే కాలనీ మూవీకి కథ అందించారు. స్కీన్‌ప్లే, సంభాషణలను అందిస్తూ షో రన్నర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు. త్వరలో సినిమాను రిలీజ్ చేయనున్నారు.
నవంబర్ 21వ తేదీన మూవీ థియేటర్లో గ్రాండ్ గా రిలీజ్ కానుండగా.. మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తూ సందడి చేస్తున్నారు. ఇటీవల ఫస్ట్ సింగిల్ తోపాటు టీజర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో మంగళవారం సాయంత్రం మేకర్స్.. 12ఏ రైల్వే కాలనీ ట్రైలర్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంటోంది. అందరిలో సినిమాపై ఉత్కంఠను పెంచుతుందనే చెప్పాలి. సినిమాతో మేకర్స్ ఓ సరికొత్త ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఆడియన్స్ ను అలరించే ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్.. సినిమాలో ఫుల్ గా ఉన్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది.
మంచు కొండల్లో అల్లరి నరేష్ నడుస్తున్న సీన్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత సినిమాలో కీలకమైన పాయింట్స్ ను రివీల్ చేస్తూ పాత్రలను పరిచయం చేశారు మేకర్స్. మూవీలో ఇంపార్టెంట్ సీన్స్ ను చిన్న చిన్న పార్టులుగా చూపించారు. ఓవరాల్ ట్రైలర్ అంతా.. సినిమాపై ఆసక్తి క్రియేట్ చేసేలా మేకర్స్ కట్ చేశారని చెప్పాలి.
అయితే ఎప్పటిలానే అల్లరి నరేష్.. మరోసారి యాక్టింగ్ తో అలరించేలా కనిపిస్తున్నారు. సాయి కుమార్.. తన యాక్షన్ తో అదరగొట్టనున్నారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. కొన్ని కొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అవుతుందంటూ వచ్చిన ట్రైలర్ లోని డైలాగ్స్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాయి. భీమ్స్ సిసిరోలియో అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. మరి 12ఏ రైల్వే కాలనీ మూవీ ఎలాంటి రిజల్ట్ సాధిస్తుందో వేచి చూడాలి.