బాలీవుడ్ లో చిన్న సినిమాలకు కలిసొస్తున్న కొత్త ట్రెండ్
రూ.100 కోట్ల క్లబ్ అనేది సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి డ్రీమ్. ఆ క్లబ్ లో తమ సినిమా ఉండాలని చిన్న యాక్టర్ నుంచి అందరూ కోరుకుంటారు.;
రూ.100 కోట్ల క్లబ్ అనేది సినీ ఇండస్ట్రీలో ఉన్న ఎంతోమందికి డ్రీమ్. ఆ క్లబ్ లో తమ సినిమా ఉండాలని చిన్న యాక్టర్ నుంచి అందరూ కోరుకుంటారు. అయితే ఇప్పటికే ఎన్నో సినిమాలు రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ఈ ఇయర్ రూ.100 కోట్ల క్లబ్ లో సినిమాలు ఎక్కువగానే చేరాయి. ఇంకా చెప్పాలంటే ఏ పెద్ద సినిమా రిలీజ్‌కైనా రూ.100 కోట్ల క్లబ్ అనేది ఇప్పుడక్కడ మినిమంగా మారినట్టు అనిపిస్తోంది.
చిన్న సినిమాలకు కలిసొస్తున్న రూ.100 కోట్ల ట్రెండ్
ప్రతీ పెద్ద సినిమా ఇప్పుడు రూ.100 కోట్ల క్లబ్ ను టార్గెట్ గా పెట్టుకుని దాన్ని దాటాలని చూస్తోంది. ఈ ట్రెండ్ ఎంతగా మారిందంటే సినిమాకు పెట్టిన మొత్తం బడ్జెట్ రికవరీ అవకపోయినా, రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తే ఆ సినిమాను హిట్ గా లెక్కేస్తున్నారు. అయితే ఈ అంశం చిన్న బడ్జెట్ సినిమాలకు మాత్రం బాగా కలిసొస్తుంది. రీసెంట్ గా వచ్చిన ఎన్నో సినిమాలు ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. ఆమిర్ ఖాన్ సితారే జమీన్ పర్ రూ.100 కోట్లను క్రాస్ చేసి, ఎమోషనల్ కంటెంట్ తో మంచి ప్రశంసలు అందుకుంది. సినిమాకు మిక్డ్స్ రివ్యూస్ వచ్చినప్పటికీ, నెటిజన్లు దాన్ని బ్లాక్ బస్టర్ గా నిలిపారు. తర్వాత అక్షయ్ కుమార్ నటించిన జాలీ ఎల్ఎల్‌బీ3 కూడా రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేసింది.
నిర్మాతలు సంబరాలు.. డిస్ట్రిబ్యూటర్ల ఆందోళన
రైడ్2, జాత్, హౌస్‌ఫుల్5, కేసరి చాప్టర్2, సికందర్ లాంటి సినిమాలు కూడా ఈ రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరాయి. ఈ విషయంలో నిర్మాతలు సంతోషంగా సంబరాలు చేసుకుంటున్నప్పటికీ థియేటర్ల ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం ఆందోళన చెందుతున్నారు. సినిమాకు మంచి కలెక్షన్లు వస్తున్నప్పటికీ, వీక్ కంటెంట్ రెండు, మూడు వారాలకు మించి ఆడియన్స్ ఇంట్రెస్ట్ ను నిలబెట్టుకోలేకపోతుందని చెప్తున్నారు.
ఇది ఇలానే కంటిన్యూ అయితే థియేటర్లు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని కొందరు హెచ్చరిస్తున్నారు. చిన్న, మీడియం బడ్జెట్ సినిమాల సక్సెస్ మారుతున్న ఆడియన్స్ బిహేవియర్ ను తెలియచేస్తుంది. అయినప్పటికీ అసలైన ఛాలెంజ్ సినిమా క్వాలిటీని కాపాడుకోవడంలోనే ఉంది. మరిన్ని కొత్త రిలీజులు, ఫ్రాంచైజీలు వరుసగా రానున్న నేపథ్యంలో ఈ రూ.100 కోట్ల ట్రెండ్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది చూడాలి.