• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Business >  ఎవరీ నెవిల్లే టాటా?...

ఎవరీ నెవిల్లే టాటా? అకస్మాత్తుగా వార్తల్లోకి ఎందుకు వచ్చారు?

| భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ లలో ప్రముఖమైంది టాటా. ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన వేళలో

By - Tupaki Desk
Update: 2024-08-22 04:14 GMT

భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్ లలో ప్రముఖమైంది టాటా. ఎంపిక చేసుకోవాల్సి వచ్చిన వేళలో.. ఆ వరుసలో టాటా గ్రూపు ఉత్పత్తులు ఉంటే.. మరో ఆలోచన లేకుండా వాటిని తీసేసుకోవటానికి ఏ మాత్రం సంకోచించని తత్వం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి టాటా గ్రూపులోకి కొత్త తరం ఎంట్రీ ఇచ్చేస్తోంది. కరుగుతున్న కాలానికి తగ్గట్లు.. పెద్ద వయస్కులు బాద్యతల బరువును తగ్గించుకుంటూ ఉంటే.. కొత్త తరం యూత్ ఫుల్ గా ఎంట్రీ ఇస్తోంది.

తాజాగా టాటాలకు చెందిన నెవిల్లే టాటా గ్రూపు కంపెనీల్లో కీలకమైన స్టార్ బాధ్యతలను చేపట్టటం ఆసక్తికరంగా మారింది. ఈ 32 ఏళ్ల కుర్రాడు రతన్ టాటాకు ఏమవుతారు? అతడి బ్యాక్ గ్రౌండ్ ఏమిటి? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నెవిల్లే టాటా మరెవరో కాదు.. టాటా సన్స్ ఛైర్మన్ రతన్ టాటా సవతి సోదరుడు నోయల్ కుమారుడు. టాటా గ్రూపు.. బ్రిటిష్ రిటైలర్ టెస్కో ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ ట్రెంట్ లిమిటెడ్. స్టార్ మార్కెట్ తో పాటు వెస్ట్ సైడ్.. జుడియో.. జరా వ్యాపారాల్ని ఈ కంపెనీ చేపట్టిన సంగతి తెలిసిందే.

ట్రెంట్ హైపర్ మార్కెట్ బోర్డులో సభ్యుడిగా ఉన్న నెవిల్లే.. ఎగ్జిక్యూటివ్ బాధ్యతలు చేపట్టారు. లండన్ లోని బేయెస్ బిజినెస్ స్కూల్లో చదివిన నెవిల్లే.. గడిచిన ఎనిమిదేళ్లుగా ట్రెంట్ లిమిటెడ్ బాధ్యతల్ని చూస్తున్నాడు. మొదట్లో ఫుడ్.. బెవరేజెస్ వ్యాపారాన్ని చూసుకున్న అతను.. ఆ తర్వాత దుస్తులవ్యాపారమైన జుడియో నిర్వహణను చూస్తున్నారు. ఆ తర్వాత కొంతకాలం విదేశాల్లో చదువుకున్న అతను.. తాజాగా స్టార్ మార్కెట్ వ్యాపార బాధ్యతల్ని అందుకున్నారు.

కొద్దికాలంపాటు ఆయనకు అతడి తండ్రి నోయల్ టాటా మార్గదర్శనం చేస్తారని.. త్వరలో సీఈవో లేదంటే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టనున్నట్లు చెబుతున్నారు. టాటా గ్రూపులోకి ఇప్పుడు టాటాల యువతరం ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే నోయల్ టాటా కుమార్తెలు యాక్టివ్ గా ఉన్నారు. 39 ఏళ్ల లేహ్ టాటా ఇండియన్ హోటల్స్ విభాగానికి.. 35 ఏళ్ల మాయా టాటా వచ్చేసరికి టాటా డిజిటల్ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. ఆమె ప్రచారానికి దూరంగా ఉంటారన్న పేరుంది. ఆమె ఎక్కడా ఫోకస్ అయ్యేందుకు ఇష్టపడరని చెబుతుంటారు. తాజాగా టాటా గ్రూప్ కు చెందిన స్టార్ బాధ్యతల్ని 32 ఏళ్ల నెవిల్లే టాటా చేపట్టనున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ ముగ్గురు టాటాలు నిర్వహించే పలు ట్రస్టులకు ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు.

Tags:    
  • Trentltd 
  • Nevilletata 
  • Tatagroups 
  • Ratantata 
  • Zudion 
  • Westside 
  • Zara 
  • Tatadigital 
  • Nevilletatatatagroups 

Similar News

ధన త్రయోదశి మరీ.. మనోళ్ల బంగారం కొనుగోళ్లు ఏం రేంజ్ లో ఉన్నాయంటే?

2026-11-07 06:50 GMT

థియేట‌ర్ల వ్యాపారంలో స్టార్ హీరో 600 కోట్లు పెట్టుబ‌డి!

2026-11-07 04:02 GMT

అమెరికా ఎన్నికల ఎఫెక్ట్.. భారత స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీ.. ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల లాభం!

2026-11-05 06:54 GMT

మీరు గెలిచినా, ఓడినా ఎవరికీ పట్టదు.. వైరల్ అవుతున్న బిజినెస్‌మ్యాన్ ట్వీట్!

2026-11-03 15:30 GMT

రోజుకు లక్ష కోట్లు.. భారత యూపీఐ పవర్ ఇదీ

2026-11-01 15:05 GMT

సినిమాలకు దూరంగా ఉన్నా.. భారీగా సంపాదిస్తున్న సమంత!

2026-10-22 12:30 GMT

వామ్మో ఇదేం తాగుడు? రోజులో రూ.303 కోట్ల లిక్కర్ సేల్

2026-10-22 08:00 GMT

3300 కోట్ల సంప‌ద సృష్టి వెన‌క సీక్రెట్.. ఈ న‌టుడు ఒక బ్యాడ్ బిజినెస్‌మేన్!

2026-10-16 09:30 GMT

UKలో బిజినెస్: క‌త్రిన కంటే ముందే స‌క్సెసైన టాప్-3 హీరోయిన్‌లు!

2026-10-13 03:38 GMT

ఇండియా బెస్ట్ స్టార్లు సినిమాల‌తో ప‌ని లేకుండా సంపాదనాప‌రులు!

2026-10-08 03:48 GMT

ప్రకటనలు కాదు.. ప్రజల పార్టిసిపేషన్‌తో పబ్లిసిటీ.. కంపెనీ మాస్టర్ ప్లాన్!

2026-10-07 06:16 GMT

$110 బిలియన్ల భారీ డీల్: స్కైడాన్స్ గా మారిన‌ పారామౌంట్ - వార్నర్ బ్రోస్ ఉమ్మడి సంస్థ!

2026-10-03 10:29 GMT

Copyright @2026

Powered by Blink CMS