• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Box Office >  ఈ వారం బాక్సాఫీస్.. రెండు...

ఈ వారం బాక్సాఫీస్.. రెండు చిత్రాలతోనే అసలు సందడి

| అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ ముందు​ భారీ సందడి వాతావరణం నెలకొంది.

By - Tupaki Desk
Update: 2023-07-27 08:34 GMT

టాలీవుడ్​లో గత రెండు, మూడు వారాలుగా అన్ని చిన్న చిత్రాలే ప్రేక్షకుల్ని అలరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక్క పెద్ద సినిమా కూడా ఏదీ రాలేదు. వీటిన్నింటిలో కేవలం శ్రీవిష్ణు నటించిన 'సామజవరగమణ', ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య 'బేబీ' మాత్రం సన్సేషనల్​ హిట్​గా నిలిచాయి. అయితే ఈ వారం మాత్రం బాక్సాఫీస్ ముందు​ భారీ సందడి వాతావరణం నెలకొంది. అదే పవర్​ స్టార్ పవన్ కల్యాణ్​-మెగా యంగ్ హీరో సాయి తేజ్​ కలిసి నటించిన మల్టీ స్టారర్​ మూవీ 'బ్రో'.

ఇంకో రోజులో అంటే జులై 28న ఈ సినిమా గ్రాండ్​గా విడుదల కానుంది. అయితే ఈ బ్రో చిత్రంతో మరో రెండు చిత్రాలు కూడా థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. వాటిలో సీనియర్​ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా నటించిన చిత్రం 'స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌' ఒకటి కాగా.. ఇంకోటి బాలీవుడ్‌ స్టార్ హీరో రణవీర్‌ సింగ్‌ - అలియా భట్‌ కలిసి నటించన 'రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ'.

అయితే ఈ చిత్రాల్లో మొదటగా అందరి ఫోకస్​ 'బ్రో' పైనే ఉంటుంది. ఎందుకంటే మామాఅల్లుళ్లు కలిసి నటించిన చిత్రమిది. అందులో పైగా మెగా ఫ్యామీలికి చెందిన ఇద్దరు హీరోలు కలిసి ఒకే స్క్రీన్​ను షేర్ చేసుకోవడం మరింత విశేషం.

ఈ సినిమా తమిళ సూపర్ హిట్ వినోదయ సీతమ్​కు రీమేక్​ ఇది. ఏదిఏమైనా పవన్ సినిమా కాబట్టి.. ప్రేక్షకులు ఈ సినిమాకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ కచ్చితంగా వెళ్తారు. మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి.

ఇక దీని తర్వాత సీనియర్​ నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్‌రావు హీరోగా నటించిన చిత్రం 'స్లమ్‌ డాగ్‌ హస్బెండ్‌'. బ్రో టికెట్లు మిస్ అయిన వాళ్లు ఈ చిత్రానికి కచ్చితంగా వెళ్తారు. బ్రహ్మాజీ, సప్తగిరి ఇతర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫన్ కామెడీగా తెరకెక్కింది.

ఈ చిత్రం టైటిల్​, ఫస్ట్ లుక్ పోస్టర్​తోనే అందర్నీ ఆకర్షించింది. ప్రమోషన్స్​ కూడా బాగా డిఫరెంట్​గా చేశారు. జాతకంలో దోషం ఉన్న ఓ యువకుడు శునకాన్ని పెళ్లి చేసుకోవడంతో అతడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? ఆ వివాహం వల్ల ఎలాంటి కష్టాలను ఎదుర్కొన్నాడు? వంటి విషయాలతో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా 29న రిలీజ్​ కానుంది.

ఇక మిగిలింది బాలీవుడ్‌ స్టార్ హీరో రణవీర్‌ సింగ్‌ - అలియా భట్‌ కలిసి నటించన 'రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ'. జులై 28న ఇది రానుంది. దీనికి కరణ్​ జోహార్​ తెరకెక్కించారు. దీనికి తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా ఆడే అవకాశం లేదు. కథ బాగుందని టాక్​ వస్తే ఆలియాభట్​కు ఉన్న కాస్త క్రేజ్​తో చూడొచ్చు.

Tags:    
  • Tollywood 
  • Boxoffice 
  • BroMovie 
  • Pawankalyan 
  • Saidharamtej 
  • Slumdoghusband 
  • Brahmaji 
  • Sanjayrao 
  • Ranveersingh 
  • Aliabhatt 

Similar News

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

2026 వెయ్యి కోట్ల రేసు.. రామాయణమే దిక్కా?

2026-11-03 04:34 GMT

AK 47 బాక్సాఫీస్.. అసలైన మండే పరిస్థితి ఇది!

2026-11-03 04:27 GMT

కోలీవుడ్ చరిత్రలో సరికొత్త అధ్యాయం!

2026-11-02 09:52 GMT

సెలవుల దెబ్బకు తగ్గిన కలెక్షన్లు..అయినా రేసులో త‌గ్గ‌ని చిత్రాలు!

2026-11-02 07:35 GMT

పండగ రేసులో భారీ చిత్రాల సునామీ

2026-11-01 15:30 GMT

అల్ట్రా వయొలెన్ప్.. ఇంట్రెస్ట్ లేదు బాస్

2026-10-31 14:53 GMT

1000 కోట్ల డిబేట్‌పై సుబ్బరాజ్ చమత్కారం!

2026-10-30 13:01 GMT

Copyright @2026

Powered by Blink CMS