Begin typing your search above and press return to search.

సమ్మోహనుడా అంటూ.. రూల్స్ రంజన్ తో నేహాశెట్టి రొమాన్స్..!

రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ సరసన డిజే టిల్లూ బ్యూటీ నేహా శెట్టి నటిస్తోంది

By:  Tupaki Desk   |   20 July 2023 6:21 AM GMT
సమ్మోహనుడా అంటూ.. రూల్స్ రంజన్ తో నేహాశెట్టి రొమాన్స్..!
X

యంగ్, టాలెంటెడ్ టాలీవుడ్ హీరోల్లో కిరణ్ అబ్బవరం కూడా ఒకరు. కిరణ్ ని చూడగానే మన పక్కింటి అబ్బాయిని చూసిన అనుభూతి కలుగుతుంది. తను ఎంచుకునే సినిమాలు కూడా అలానే ఉంటాయి. రాజావారు, రాణివారు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ కుర్రాడు, వరస అవకాశాలు అందుకొని దూసుకుపోతున్నాడు. మొదటి సినిమాలు చాలా అమాయకంగా కనిపించిన కిరణ్, రెండో సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపంతో అదరగొట్టాడు.

ఈ కుర్రాడిలో ఇంత టాలెంట్ ఉందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ మూవీతో ఒక్కసారి గా అందరికీ తానేంటో నిరూపించాడు. ఈ క్రమంలో వరసగా అవకశాలు అందిపుచ్చుకుంటున్నాడు. అయితే, సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం రూల్స్ రంజన్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

రత్నం కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ సరసన డిజే టిల్లూ బ్యూటీ నేహా శెట్టి నటిస్తోంది. స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. కాగా, మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే మూవీని జనాల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు.

ఈ క్రమంలోనే మూవీలోని పాటలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూవీ ఫస్ట్ లుక్ తో పాటు, నాలో నేను లేను అనే పాట బాగా క్లిక్ అయ్యింది. కాగా, తాజాగా సమ్మోహనుడా అనే పాటను విడుదల చేశారు. పాట చాలా సమ్మోహనంగా ఉంది. ఇది రొమాంటిక్ సాంగ్ కాగా, చెవులకు విన సొంపుగా ఉంది. హీరో, హీరోయిన్లను ఒకరిపై మరొకరికి ఉన్న మోహాన్ని తెలియజేస్తున్నట్లుగా ఈ పాట సాగుతుండటం విశేషం. విజువల్స్ కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇదిలా ఉండగా, ఈ మూవీలో సరికొత్త కిరణ్ అబ్బవరం కనిపిస్తాడని చిత్ర బృందం చెబుతోంది. మూవీ లో మంచి ప్రేమ కథతో పాటు, ఆకట్టుకునే కథ కూడా ఉంటుందని, ప్రేక్షకులు మనసారా నవ్వుకునేలా, మంచి ఎంటర్ టైన్మెంట్ అవుతుందని మూవీ టీమ్ ధీమా గా ఉంది. ఇక, ఈ మూవీ త్వరలోనే థియేటర్స్ లోకి అడుగుపెట్టనుంది.