తొలి ఏఐ ఫిల్మ్ వచ్చేస్తోంది బడ్జెట్ ఎంతంటే..!
ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 23 April 2025 1:45 PM ISTఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ టెక్నాలజీ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. పది మంది చేసే పని ఒక్క ఏఐతో పూర్తవుతోంది. దీని వల్ల చాలా వరకు మధ్య తరగతి నుంచి అనేక మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారని బిల్ గేట్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేస్తున్నా ఏఐ వినియోగం మాత్రం టెక్నాలజీ విభాగంలో రాకెట్ స్పీడుతో దూసుకొచ్చేస్తోంది. ఇటీవల ఏఐ టెక్నాలజీ వినిపయోగం గురించి ఓ ప్రత్యేక సంస్థని ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఏర్పాటు చేయబోతుండటం చర్చనీయాంశంగా మారడం తెలిసిందే.
దీన్ని రానున్న రోజుల్లోసినిమాల్లోనూ విరివిగా ఉపయోగించుకోవాలనే ఆలోచనల్లో మేకర్స్ ఉన్నారు. చాలా వరకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో సినిమాల నిర్మాణం ఎలా చేయొచ్చు, దాని సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతుండగానే ఓ నిర్మాత ఏకంగా సినిమానే రూపొందించి ఆశ్చర్యపరిచాడు. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో నిర్మించి రికార్డు సృష్టించారు.
బెంగళూరులోని సిద్దెనహళ్లికి చెందిన ఓ ప్రీస్ట్ నరసింహమూర్తి మొట్టమొదటి ఏఐ టెక్నాలజీ మూవీని రూపొందించి ఆశ్చర్యపరిచాడు. తనే నిర్మాతగా, డైరెక్టర్‌గా `లవ్ యు` పేరుతో సినిమాని రూపొందించారు. ఈ సినిమాకు ఆయన పెట్టిన ఖర్చు అక్షరాలా రూ.10 లక్షలు మాత్రమే కావడం విశేషం. అక్కడి హనుమంతరాయ్ టెంపుల్‌లో అర్చకుడిగా వ్యవహరిస్తున్న నరసింహా మూర్తి దర్శకుడు కావాలను లక్ష్యంతో ఈ మూవీని రూపొందించి కన్నడ ఇండస్ట్రీ వర్గాలని షాక్‌కు గురి చేశారు.
95 నిమిషాల నిడివితో రూపొందించిన ఈ సినిమాకు ఇటీవలే సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ సినిమా నిర్మాణం కోసం 30 డిఫరెంట్, డిఫరెంట్ ఏఐ టూల్స్‌ని వినిపయోగించారట. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన టీజర్, ఫస్ట్ సింగిల్‌కు సంబంధించిన వీడియోలని విడుదల చేశారు. అవి నెట్టింట సవైరల్ అవుతున్నాయి. 12 ఒరిజినల్ సాంగ్స్‌తో రెడీ అవుతున్న ఈమూవీని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.