Begin typing your search above and press return to search.

చంద్రబాబు...పవన్...అంతా పక్కా ప్లాన్ తోనే...!

By:  Tupaki Desk   |   18 Jan 2023 3:11 AM GMT
చంద్రబాబు...పవన్...అంతా పక్కా ప్లాన్ తోనే...!
X
ఏపీలో తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తులు కొత్తగా కుదిరాయి అనుకుంటే పొరపాటు. దాని వెనక ఫ్లాష్ బ్యాక్ చాలానే ఉంది. 2019లో కూడా పొత్తులు తెరచాటున ఉన్నాయని వైసీపీ నేతలు అంటారు. అదే నిజం అనుకుంటే ఆ తరువాత జరిగిన పరిణామాలు అన్నీ కూడా ఒక క్రమపద్ధతిలో సాగాయి అనుకోవాలి. బీజేపీతో పవన్ చేతులు కలపడం కానీ, అదే టైం లో బాబు కుడి ఎడమ భుజాలు లాంటి ఎంపీలు బీజేపీలో చేరడం కానీ అంతా ఒక పద్ధతిలోనే జరిగింది అనుకోవాలి.

ఇక పవన్ విశాఖలో లాంగ్ మార్చ్ పెడితే దానికి తెలుగుదేశం నుంచి అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. ఆ తరువాత కానీ ముందు కానీ ఎక్కడా తెలుగుదేశం మీద పవన్ ఒక్క మాట అనలేదు. ఆ మాటకు వస్తే 2019 ఎన్నికల్లో సైతం పవన్ ఎక్కువగా జగన్ మీదనే తన విమర్శలు చేస్తూ వచ్చారు. ఆయన్నే సీఎం కానీయను అంటూ వచ్చారు. ఇక లోకల్ బాడీ ఎన్నికలు వచ్చేసరికి కొన్ని చోట్ల జనసేన తెలుగుదేశం బంధం గ్రౌండ్ లెవెల్ లో మళ్లీ కలసింది.

అంటే పై స్థాయిలో రిలేషన్స్ అలా ఉన్నా గ్రౌండ్ లెవెల్ లో ఒకసారి వేరుగా మరోసారి కలివిడిగా అంటూ సాగే ఈ బంధాలు అర్ధం కావడానికే ఇంత టైం తీసుకున్నారు అని అంటున్నారు. ఇక తెలుగుదేశం జనసేన పొత్తులు అనధికారికంగా కుదిరిపోయాయి అని అంటున్నారు. దాదాపుగా మూడు గంటల పాటు చంద్రబాబు ఇంట్లో పవన్ మాట్లాడుకున్నది ఇదే అని అంటున్నారు. అంటే సీట్ల బేరం కూడా ఒక కొలిక్కి వచ్చేసినట్లే అని చెబుతున్నారు.

అయితే దాన్ని జనసైనికులకు అర్ధం అయ్యేలా చెప్పాలి. ఎందుకంటే పవన్ని సీఎం అని అంటున్నారు. దాంతో వారికి రాజకీయాలు వాస్తవంగా ఏమిటో చెప్పి తమకు అందలం కంటే అసలైన ప్రత్యర్ధి ఎవరో చెప్పాలి. అందుకే రణస్థలం సభగా చెబుతున్నారు. పవన్ అక్కడ తన కోసం ముప్పయి ఎకరాల స్థలం సైతం పట్టనంతగా వేలాదిగా జనాలు వస్తే ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తామని గ్యారంటీ ఇస్తారా అని అడిగారు. ఆ తరువాత వారు ఏమన్నది పక్కన పెట్టి పొత్తులు ఎందుకోసమో వివరించే ప్రయత్నం చేశారు.

బలమైన శత్రువుని ఎదుర్కోవడానికి ఒంటరిగా వెళ్లి వీరమరణం పొందడం కంటే పొత్తులతో వెళ్ళడం బెటర్ అని పవన్ హితబోధ చేశారు. దానికి జనసైనికుల నుంచి అనుకూల స్పందన ఎంత శాతం వచ్చింది అనేదాని కంటే వ్యతిరేకత అయితే రాలేదు అనే చెప్పాలి. అయితే అదే వేదిక మీద మాట్లాడిన జబర్దస్త్ నటుడు ఆది ముఖ్యమంత్రిగా పవన్ని చూడాలని ఉంది అని అది తన కోరిక అని చెప్పుకున్నారు. ఆది లాంటి హార్డ్ కోర్ ఫ్యాన్ మనసులో మాట అది అన్నది తేలాక కూడా మాట్లాడిన పవన్ పొత్తుల విషయమే చెప్పుకొచ్చారు.

అయితే ఇక్కడ ఆయన గౌరవప్రదమైన తీరులో సీట్లు అని అంటున్నారు. అది కూడా ముందే చంద్రబాబుతో మాట్లాడి ఉండవచ్చు అని అంటున్న వారూ ఉన్నారు. ఇక క్యాడర్ కి నచ్చచెప్పే విషయంలోనే ఆయన గౌరవం అన్న మాట వాడారు, అది ఫక్తు ఫ్యూహాత్మకం అని కూడా అంటున్నారు. అంటే పవన్ కోరుకున్న సీట్లు అయితే ఇచ్చేందుకు తెలుగుదేశం అంగీకరించింది అనే అంటున్నారు. అదే టైం లో పవన్ క్యాడర్ కి చెప్పే మాట ఇటు తమ్ముళ్లకూ వినిపించాలనే ఆ సభ ద్వారా ప్రయత్నం చేశారు అని అంటున్నారు.

అంటే తెలుగుదేశం కూడా వ్యూహాత్మకంగా పవన్ నోటి వెంట ఆయన డిమాండ్ ని బహిరంగంగానే వినిపించింది అని అంటున్నారు. ఆ విధంగా చేయడం వల్ల చంద్రబాబు పని కూడా సులువు అవుతుంది, జనసేన డిమాండ్ అది, ఆ విధంగా సీట్లు ఇవ్వక తప్పని పరిస్థితి అని చెప్పి తమ్ముళ్ళ ఆశలకు సీట్ల కోరికకు కళ్లెం వేయవచ్చు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే మాత్రం అటు చంద్రబాబు కానీ ఇటు పవన్ కానీ పక్కా ప్లాన్ తోనే పొత్తుల ఎత్తులను నడుపుకుంటూ వస్తున్నారు అని అంటున్నారు.

ఈ విషయాలు రాజకీయాల్లో ఉన్న వారికి అర్ధం అయినా క్యాడర్ కి అర్ధం కావడం కష్టం. వారికి అర్ధమైనా వ్యతిరేకించకుండా ఉండడం ఇంకా ముఖ్యం. అందుకే మెల్లగా వారికి వివరించే ప్రయత్నంలో తొలి అంకమే రణస్థం సభ అంటున్నారు. ఇక మరిన్ని సభలు ఇలాంటివి జరుగుతాయి. చివరిని తాము అనధికారికంగా సెట్ చేసుకున్న పొత్తులను టైం చూసి ప్రకటిస్తారు అని అంటున్నారు. సో అటు బాబు ఇటు పవన్ తెలివిగానే ఏపీలో పావులు కదుపుతున్నారు. అది తమ క్యాడర్ ని దారికి తెచ్చుకోవడం కోసం అని అంటున్నారు. ఈ విధంగా చేయడం వల్ల వైసీపీ వ్యతిరేక ఓటు ఒక్కటీ చీలకుండా పక్కాగా కూటమికి పడుతుంది. అదే పవన్ బాబుల మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.